AP School Dussehra & Sankranti Holidays 2026 : విద్యార్థులకు శుభవార్త.. పాఠశాలలకు దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే?

AP School Dussehra & Sankranti Holidays 2026 : విద్యార్థులకు శుభవార్త.. పాఠశాలలకు దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే?

AP School Dussehra and Sankranti Holidays List 2026-27 Date : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు 12 జూన్ నుంచి స్కూల్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఇందులో మొత్తం 229 పనిదినాలు, అన్ని ఆదివారాలతో కలిపి 87 సెలవులు ఉన్నాయి. 2026-27 సంవత్సరంలో 12 అక్టోబర్ నుంచి 21 అక్టోబర్ వరకు దసరా సెలవులు, 20 డిసెంబర్ నుంచి 27 డిసెంబర్ మధ్యలో క్రిస్మస్ సెలవులు, 11 జనవరి నుంచి 17 జనవరి మధ్యలో సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ ఉండనున్నది. అలాగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎగ్జామ్స్ 15 మార్చి నుంచి 31 మార్చి 2027 లో జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు శనివారం నో బ్యాక్ డేగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం రోజు విద్యార్థులకు ఆటపాటలు, క్విజ్ & ఇతర నైపుణ్య సాధనలకు పాల్గొంటారు. మార్చినాటికే సిలబస్ పూర్తి చేసి రివిజన్ పరీక్షలు ముగించేలాగా ఉపాధ్యాయులకు స్పష్టమైన మార్గదర్శకాలు ప్రవేశపెట్టారు. 15 మార్చి 2027 నుంచి 31 మార్చి 2027 మధ్యలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జాబ్ క్యాలెండర్ స్పష్టం చేశారు. జూన్లో ప్రత్యేక అడ్మిషన్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు.

ముఖ్యమైన వివరాలు

2026- 27 విద్యాసంస్థల పాఠశాల క్యాలెండర్ విడుదల

•మొత్తం 229 పని దినాలు
•మొత్తం 87 సెలవు దినాలు
• ప్రతి శనివారం నో బ్యాగ్ డే
•దసరా సెలవులు : అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 21 వరకు
•క్రిస్మస్ సెలవులు : డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 27 వరకు
•సంక్రాంతి సెలవులు : జనవరి 11 నుంచి జనవరి 17 వరకు
•10వ తరగతి పబ్లిక్ పరీక్ష షెడ్యూల్ : మార్చి 15 నుంచి మార్చి 31 వరకు 2027 లో

విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు పై చెప్పినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ని, దృష్టిలో ఉంచుకోగలరు. అలాగే కొత్త సంవత్సరంలో కొత్త పుస్తకాలు పంపిణీ తరగత గదుల సిద్ధం చేయడం వంటి పనులు పూర్తయ్యాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *