AP School Summer Holidays 2026 Extension : స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు.. క్లారిటీ
AP School Summer Holidays 2026 Extension Clarity : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో స్కూల్ రీఓపెనింగ్ పై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో వేసవి సెలవులు పొడగింపు ఏమీ లేదని తెలిపారు. ముందుగా తెలిపిన విధంగానే ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్లో ఈనెల జూన్ 12న పునఃప్రారంభం ప్రారంభం కానున్నాయి. టీచర్లు, విద్యార్థులు & తల్లిదండ్రులు ప్రచారం అవుతున్న తప్పుడు సమాచారం నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపారు. కానీ తెలంగాణలో రీఓపెనింగ్ కి 15న వాయిదా వేశారు.

తెలంగాణలో స్కూల్లకు వేసవి సెలవులు పొడిగించారు. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్లో రీఓపెనింగ్ తేదీని మారుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించారు. జూన్ 12న స్కూల్ తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా, జూన్ 15 కి వాయిదా వేసినట్లు తెలిపారు. 13వ తేదీన శనివారం, 14వ తేదీన ఆదివారం కావడంతో తెలంగాణ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు శనివారానికి బదులుగా జూలై 11వ తేదీన రెండో శనివారాన్ని వర్కింగ్ డే గా పరిగణిస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు ఈనెల 12నే పునఃప్రారంభం కానున్నాయని తెలిపారు. తెలంగాణలో మాత్రం ఈనెల 15న పునఃప్రారంభం కానున్నాయని తెలిపారు.

