Govt Jobs : కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest TGPSC Assistant Environmental Engineer In Telangana Pollution Control Board Notification 2026 Apply Now
TGPSC Recruitment 2026 Latest Assistant Environmental Engineer In Telangana Pollution Control Board Notification 2026 Apply Now : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా తెలంగాణలోని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుకు ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ 10/06/2026 నుండి ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ మరియు సమయం 17/07/2026 సాయంత్రం 5:00 గంటల లోపు అర్హులైన అభ్యర్థుల నుండి కమిషన్ వెబ్‌సైట్ https://www.tapsc.gov.in లో అందుబాటులో ఉంచిన ప్రొఫార్మా దరఖాస్తు ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రెగ్యులర్ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. 01/07/2026 నాటికి వయస్సు కనిష్ట గరిష్ట 18-44 Yrs లోపు వయసు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుండి సివిల్ / మెకానికల్ / కెమికల్ / బయో-టెక్నాలజీ / మైనింగ్ / ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్‌లో ప్రాథమికంగా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే B.Tech/BE/బి.ఇ తో పాటు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో పిజి డిగ్రీ లేదా AMIE(ఇండియా) సివిల్ పరీక్షలోని సెక్షన్ ఎ మరియు బి లలో అర్హత సాధించి ఉండాలి. నెల జీతం రూ.54,220-1,33,630/- మధ్యలో నెల జీతం ఇస్తారు. అభ్యర్థులు 10-06-2026 నుండి 17-07-2026 వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. TGPSC నోటిఫై చేసిన పోస్టుకు అభ్యర్థి మొదటిసారి దరఖాస్తు చేస్తుంటే, వారు కమిషన్ వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ద్వారా తమ బయో-డేటా వివరాలను నమోదు చేసుకోవాలి.
•పోస్ట్ వివరాలు
•తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ -19 ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.

•కనీస విద్య అర్హత :
•కేంద్ర చట్టం, ప్రాంతీయ చట్టం లేదా రాష్ట్ర చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని విశ్వవిద్యాలయం నుండి లేదా విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్)చే గుర్తింపు పొందిన సంస్థ నుండి సివిల్ / మెకానికల్ / కెమికల్ / బయో-టెక్నాలజీ / మైనింగ్ / ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్‌లో ప్రాథమికంగా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా AMIE(ఇండియా) సివిల్ పరీక్షలోని సెక్షన్ A మరియు B లలో అర్హత సాధించి ఉండాలి. లేదా కేంద్ర చట్టం, ప్రాంతీయ చట్టం లేదా రాష్ట్ర చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని విశ్వవిద్యాలయం నుండి లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా విభాగంలో B.Tech/BE/బి.ఇ తో పాటు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో పిజి డిగ్రీ లేదా AMIE(ఇండియా) సివిల్ పరీక్షలోని సెక్షన్ ఎ మరియు బి లలో అర్హత సాధించి ఉండాలి.

•వయస్సు :
•కనీస వయస్సు (18 సంవత్సరాలు) కొరకు, దరఖాస్తుదారు 01/07/2008 తర్వాత జన్మించి ఉండకూడదు. గరిష్ట వయస్సు (44 సంవత్సరాలు) కొరకు, దరఖాస్తుదారు 02/07/1982 కి ముందు జన్మించి ఉండకూడదు.

•నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో రూ.54,220-1,33,630/-మధ్యలో నెల జీతం ఇస్తారు.
•అప్లికేషన్ ఫీజులు :: ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, ట్రాన్స్‌జెండర్లు మరియు మహిళా అభ్యర్థులు 50/- ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఇతర అభ్యర్థులు 450/- దరఖాస్తు రుసుము మరియు 50/- ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఒకసారి చెల్లించిన రుసుము ఎట్టి పరిస్థితుల్లోనూ వాపసు ఇవ్వబడదు లేదా సర్దుబాటు చేయబడదు.
•ఎంపిక ప్రక్రియ :: ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
•ఎలా దరఖాస్తు చేయాలి : ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి/సమర్పించడానికి ముందు దరఖాస్తుదారు వినియోగదారు మార్గదర్శినిని జాగ్రత్తగా చదవాలి. ఇంతకు ముందు OTR నమోదు చేసుకోని దరఖాస్తుదారు, TGPSC IDని పొందడానికి వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in)ను సందర్శించి OTR ఫారమ్‌ను పూరించాలి. ఇప్పటికే ఓటీఆర్‌లో నమోదు చేసుకున్న దరఖాస్తుదారు, టీజీపీఎస్సీ ఐడీని ఉపయోగించి నేరుగా దరఖాస్తు ఫారమ్‌ను పొందవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ :: 10/06/2026 నుండి
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ మరియు సమయం: 17/07/2026 సాయంత్రం 5:00 గంటలకు

🛑FullNotification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Online Apply Link Click Here

