SSC అర్హతతో టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్ గ్రేడ్ II & డ్రైవర్ నోటిఫికేషన్ వచ్చింది| CSIR CCMB Notification 2026 Salary, Eligibility, Apply Links
CSIR CCMB Recruitment 2026 Latest Technical Officer, Technician Gr II & Driver Jobs Notification 2026 Salary, Eligibility, Apply Links: CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ (CSIR-CCMB) లో టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్ గ్రేడ్ 2 & డ్రైవర్ ఉద్యోగుల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తు CSIR-CCMB వెబ్‌సైట్ https://www.ccmb.res.in లో అందుబాటులో ఉంటుంది. 28.04.2026న ఉదయం 11:00 గంటలకు ప్రారంభమై 26.05.2026న రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది.
CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ (CSIR-CCMB) లో టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్ గ్రేడ్ 2 & డ్రైవర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టును బట్టి SSC/10వ తరగతి లేదా ITI & M.Sc అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 01.06.2026 నాటికి 18 నుండి 28 సంవత్సరాలు వయసు ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 25 మే 2026 లోపు https://www.ccmb.res.in/ ఆన్లైన్ లో అప్లై చేయాలి.

CSIR CCMB Technical Officer, Technician Gr II & DriverJob Notification 2026 apply 28 Vacancy Overview :
సంస్థ పేరు ::CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR-CCMB)లో జాబ్స్
పోస్ట్ పేరు :: టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్ గ్రేడ్ 2 & డ్రైవర్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::28
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 28 సం||రాలు
విద్య అర్హత :: 10th, 12th, ITI & M. Sc
నెల జీతం :: రూ.39,970/- to రూ.91,070/-
దరఖాస్తు ప్రారంభం :: 28.04.2026
దరఖాస్తుచివరి తేదీ :: 26.05.2026
అప్లికేషన్ మోడ్ :: https://ccmb.res.in/
»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో 4 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు , 23 టెక్నీషియన్ గ్రేడ్ 2 & 01 డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
»అవసరమైన విద్యా అర్హతలు
•టెక్నికల్ ఆఫీసర్ :: హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్/హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో M.Sc., కనీసం 55% మార్కులతో (సమానమైన CGPA).
•టెక్నీషియన్ గ్రేడ్ 2 :: SSC/10వ తరగతి లేదా దానికి సమానమైనది సైన్స్ సబ్జెక్టులతో కనీసం 55% మార్కులు మరియు ఐటిఐ సర్టిఫికేట్ లేదా సైన్స్ సబ్జెక్టులతో కనీసం 55% మార్కులతో SSC/10వ తరగతి లేదా తత్సమాన విద్య మరియు ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ లేదా జాతీయ/రాష్ట్ర ట్రేడ్ సర్టిఫికేట్. లేదా సైన్స్ సబ్జెక్టులతో కనీసం 55% మార్కులతో SSC/10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ లేదా జాతీయ/రాష్ట్ర ట్రేడ్ సర్టిఫికేట్.
•డ్రైవర్ :: తక్కువ మరియు అధిక వేగ వాహనాలు (LMV & HMV) కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం. మోటారు యంత్రాంగంపై పరిజ్ఞానం (అభ్యర్థి వాహనంలోని చిన్నపాటి లోపాలను సరిచేయగలగాలి). కనీసం 03 సంవత్సరాల పాటు మోటారు కారు నడిపిన అనుభవం మరియు 10వ తరగతిలో ఉత్తీర్ణత.
»నెల జీతం : ఎంపికైన అభ్యర్థులు నెలకు స్టార్టింగ్ శాలరీ రూ.39,970/- to రూ.91,070/- మధ్యలో జీతం ఇస్తారు.
»వయోపరిమితి: అన్ని పోస్టులకు 18-28 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనలు ఆధారంగా వయో సడలింపు ఉంటుంది. SC/ST అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 05 సంవత్సరాల వరకు మరియు OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 03 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
»దరఖాస్తు రుసుము: UR, OBC (NCL), EWS అభ్యర్థులు రూ. 500/- & ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలు/మాజీ సైనికుల వర్గాలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
»ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/పరీక్ష కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులందరూ, ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్/ పోటీ రాత పరీక్ష/ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి :: అర్హులైన అభ్యర్థులు CSIR-CCMB వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు, ఆన్‌లైన్ దరఖాస్తుపై సరిగ్గా సంతకం చేసి, దాని హార్డ్ కాపీతో పాటు స్వీయ-ధృవీకరించిన మార్క్‌షీట్లు, సర్టిఫికెట్లు మొదలైన వాటి కాపీలను జతచేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తు CSIR-CCMB వెబ్‌సైట్ https://www.ccmb.res.in లో అందుబాటులో ఉంటుంది [28.04.2026న ఉదయం 11:00 గంటలకు ప్రారంభమై 26.05.2026న రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది].
APPLICATION FOR THE POST OF (Post Code: )” అని పైన వ్రాసిన కవరులో పెట్టి, 05.06.2026 (సాయంత్రం 06:00 గంటల) లోపు ఈ క్రింది చిరునామాకు చేరేలా పోస్టు ద్వారా పంపాలి (హార్డ్ కాపీని చేతితో సమర్పించడం అంగీకరించబడదు).
చిరునామా : The Section Officer (Recruitment Section), CSIR-Centre for Cellular and Molecular Biology, Uppal Road, Habsiguda, Hyderabad-500007, Telangana.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకుప్రారంభ తేదీ : 28.04.2026
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 26.05.2026

🛑Technician Gr II & DriverNotification Pdf Click Here
🛑Technical Officer Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Office Website Click Here

