AP 10th Class Results 2026 Released Date : ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల తేదీ?.. పూర్తి వివరాలు
AP 10th Class Results 2026 Released Date All Details in Telugu : ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి (SSC) ఫలితాలు కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నా విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల ప్రాసెసింగ్ పై జరుగుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి ఆందోళన గురికావొద్దని ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకుడు శ్రీనివాసరెడ్డి గారు సూచించారు. విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రచురిస్తామని తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు 2026
ఆంధ్రప్రదేశ్ లో 2026 సంవత్సరం SSC పరీక్ష 16 మార్చి 2026 నుంచి 2026 ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించారు. ఈ సంవత్సరం పరీక్షలకు సుమారుగా 6.40 లక్షల విద్యార్థులు హాజరయ్యారు.
•జవాబు పత్రాలు మూల్యాంకనం : 6 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ వరకు పూర్తి చేశారు.
•ప్రస్తుతం : మార్కుల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది.. తుది దశలో ఉంది
•ఫలితాల విడుదల తేదీ : మే మొదటి వారంలో అంచనా మాత్రమే… ఇప్పటివరకు అధికారికంగా ఫలితాల తేదీ ప్రకటించలేదు.
•ఫలితాలు విడుదల చేసే 24 గంటల ముందే విద్యాశాఖ మంత్రి లేదా ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు శ్రీనివాసులురెడ్డి గారు ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేస్తారు.
•విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://bse.ap.gov.in/ ద్వారా మాత్రమే ఫలితాలు చెక్ చేసుకోవాలి. లేదా అభ్యర్థులు AP వాట్సాప్ గవర్నెన్స్ (ManaMitra) 9552300009 నంబర్కు వాట్సాప్ ద్వారా 10వ తరగతి ఫలితాలను తెలుసుకోవచ్చును.
•విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్, DOB వివరాలను తమ దగ్గర ఉంచుకోవాలి. రిజల్ట్స్ వస్తానే ఫలితాలు తెలుసుకోవడానికి.


