AP Half Day Junior Colleges 2026 Timings : ఒంటిపూట కళాశాల టైమింగ్స్ మార్పులు.. పూర్తి వివరాలు ఇవే

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Half Day Junior Colleges 2026 Timings : ఒంటిపూట కళాశాల టైమింగ్స్ మార్పులు.. పూర్తి వివరాలు ఇవే

Ap Half Day Junior Colleges Timings : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్.. 1 ఏప్రిల్ నుంచి జూనియర్ కళాశాలలకు ఒంటిపూట.. జూనియర్ కళాశాలలు ఒంటిపూట నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ రంజిత్ బాషా ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కళాశాలలు నిర్వహించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపు నుంచే సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. టైము ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు క్లాసులు ఉంటాయి. అనంతరం భోజనం తర్వాత విద్యార్థులు ఇంటికి పంపవలసిందిగా ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 23వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయి ఆ తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. ఒకటి జూన్ నుంచి కళాశాలలు కూడా ప్రారంభమవుతాయి. మరోవైపు తెలంగాణలో జూన్ 01 నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కళాశాల రీఓపెన్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనరల్ & వొకేషనల్ విభాగాలలో రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సును అందిస్తున్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఎ.పి. రెసిడెన్షియల్, కె.జి.బి.వి.ఎస్., మోడల్ స్కూల్స్, హై స్కూల్ ప్లస్, బి.సి. వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు మరియు కాంపోజిట్ డిగ్రీ కళాశాలలు మొదలైన వాటి ప్రిన్సిపాల్స్ అందరికీ ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా, 01.04.2026 నుండి 23.04.2026 వరకు ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హాఫ్ డే తరగతులను నిర్వహించవలసిందిగా కోరడమైనది. ఈ కాలానికి తమ కళాశాలల వారీగా టైమ్‌టేబుల్‌ను సిద్ధం చేసుకోవలసిందిగా కూడా ప్రిన్సిపాల్స్‌కు సూచించడమైనది. అందువల్ల, అన్ని కళాశాలల యాజమాన్యాలు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరడమైనది.

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు స్టార్ట్ అవుతున్న ఏప్రిల్ 23 వరకు తరగతులు కొనసాగుతాయి. అలాగే ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నారు. ఏప్రిల్ పదో తేదీ నుంచి 14వ తేదీన మూల్యం కన్నా పూర్తిచేసి ఏప్రిల్ 21వ తేదీన ఫలితాలు వెల్లడి చేస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించారు. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 232 జూనియర్ కళాశాల పని దినాలు ఉంటాయి. ఇంకా, రాష్ట్రంలోని తమ పరిధిలోని అన్ని కళాశాలల యాజమాన్యాలకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, ప్రాంతీయ తనిఖీ అధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులు మరియు జిల్లా వృత్తి విద్యా అధికారులను ఆదేశించడమైనది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *