Constable Jobs : 10th అర్హతతో సచివాలయ భద్రతా దళంలోకానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Secretariat Security Force Constable Notification 2026 Apply Now
Secretariat Security Force ConstableJob Recruitment 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థుల కోసం.. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF)లో కానిస్టేబుల్ (బార్బర్) మరియు కానిస్టేబుల్ (వాషర్‌మ్యాన్) పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల.
సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF)లో కానిస్టేబుల్ (బార్బర్ & వాషర్‌మ్యాన్), జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ (నాన్-మినిస్టీరియల్) 10 పోస్టుల భర్తీకి ఇవాళ్లి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 28వ తేదీ దాకా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పోస్టులకు 10వ తరగతి అర్హతలుండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, PFT, రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 30 మార్చి, 2026 (30/03/2026) ఉదయం 00:01 గంటలకు ప్రారంభమై, 28 ఏప్రిల్, 2026 (28/04/2026) రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది. ఆ విషయాన్ని ITBPF రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ అయిన https://recruitment.itbpolice.nic.in ద్వారా తెలియజేయడం జరుగుతుంది.

Secretariat Security Force Constable Job Notification 2026 apply 10 Vacancy Overview :
సంస్థ పేరు :: సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF)లో జాబ్స్
పోస్ట్ పేరు :: కానిస్టేబుల్ (బార్బర్) మరియు కానిస్టేబుల్ (వాషర్‌మ్యాన్) పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 10
రిక్రూట్‌మెంట్ విధానం :: రెగ్యులర్/కాంట్రాక్టు జాబ్స్
వయోపరిమితి :: 18-23 సం||రాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: రూ.₹19,900-₹63,200/-
దరఖాస్తు ప్రారంభం :: 30.03.2026
దరఖాస్తుచివరి తేదీ :: 28.04.2026
అప్లికేషన్ మోడ్ :: https://recruitment.itbpolice.nic.in/
»పోస్టుల వివరాలు:
•ఈ నోటిఫికేషన్ లో కానిస్టేబుల్ (బార్బర్) మరియు కానిస్టేబుల్ (వాషర్‌మ్యాన్) ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాలు 10 భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత :: గుర్తింపు పొందిన పాఠశాల లేదా సంస్థ/బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా దానికి సమానమైనది. అభ్యర్థులు ఆ వృత్తిలో ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో పోస్టును అనుసరించిన నెల కు రూ.₹19,900-₹63,200/- జీతం ఇస్తారు. ఈ పోస్టుకు కరువు భత్యం, ఉచిత వసతి లేదా గృహ అద్దె భత్యం (HRA), రవాణా భత్యం, సెలవు ప్రయాణ రాయితీ మరియు నియమాలు/సూచనల ప్రకారం ఎప్పటికప్పుడు కేంద్ర పౌర ఉద్యోగులకు వర్తించే ఏవైనా ఇతర భత్యాలు/సౌకర్యాలు ఉంటాయి.
»వయోపరిమితి: 28 ఏప్రిల్ 26 నాటికి చివరి తేదీ నాటికి నాటికి 18 నుండి 23 సంవత్సరాలు). అభ్యర్థులు 29 ఏప్రిల్, 2003 (29/04/2003) కంటే ముందు మరియు 28 ఏప్రిల్, 2008 (28/04/2008) కంటే తరువాత జన్మించి ఉండకూడదు.
»దరఖాస్తు రుసుము: ఈ నియామకానికి దరఖాస్తు చేసుకునే జనరల్ (UR) & OBC కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు https://recruitment.itbpolice.nic.in అనే ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వే సిస్టమ్ ద్వారా దరఖాస్తు రుసుముగా రూ. 100/- (వంద రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది. ఇతర ఏ పద్ధతిలోనైనా రుసుము చెల్లించమని అందిన దరఖాస్తులు వెంటనే తిరస్కరించబడతాయి. షెడ్యూల్డ్ కులాల (SC) మరియు మాజీ సైనికులకు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
»ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మాత్రమే పిలుస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, PFT, రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు విధానం : అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ITBPF రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://recruitment.itbpolice.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 30.03.2026
•ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 28.04.2026

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

