LPG Refill Booking Timelines : గ్యాస్ బుకింగ్ టైమింగ్ లో మార్పులు… మళ్లీ గ్యాస్ బుకింగ్ ఎన్ని రోజులకు.. కేంద్రం క్లారిటీ
LPG Refill Booking Timelines all details in Telugu : సోషల్ మీడియాలో LPG రీప్లిన్ బుకింగ్ పై వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించి సిలిండర్ బుకింగ్ సమయ పరిధిలో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారం ఏమాత్రం నిజం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు 25 మార్చి బుధవారమున Twitter లో ఒక ప్రకటన విడుదల చేశారు వినియోదారులను ఎటువంటి ఆందోళన పడనవసరం లేదని తెలియజేశారు.

LPG సంబంధించి కొన్ని వార్తా నివేదికలు మరియు సోషల్ మీడియా పోస్టులు గురించి ఎల్‌పిజి రీఫిల్ బుకింగ్ గడువులను సవరించినట్లుగా పేర్కొంటున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఆ గడువుల ప్రకారం, పిఎమ్‌యువై (PMUY) కనెక్షన్‌లకు 45 రోజులు, పిఎమ్‌యువై-యేతర సింగిల్ బాటిల్ కనెక్షన్‌లకు 25 రోజులు, మరియు పిఎమ్‌యువై-యేతర డబుల్ బాటిల్ కనెక్షన్‌లకు 35 రోజులుగా నిర్ణయించారు. అలాంటి మార్పులేవీ చేయబడలేదని స్పష్టం చేయడమైనది.
ప్రస్తుతం ఉన్న రీఫిల్ బుకింగ్ గడువులు యథాతథంగా కొనసాగుతాయి. పట్టణ ప్రాంతాలలో 25 రోజులు, మరియు గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులు, కనెక్షన్ రకంతో సంబంధం లేకుండా పౌరులు ఇటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని, మరియు అనవసరంగా లేదా ఆందోళనతో ఎల్‌పిజి రీఫిల్‌లను బుక్ చేసుకోవడం మానుకోవాలని సూచించడమైనది.

దేశంలో తగినంత LPG నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించడమైనది పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించారు.
🛑Clarification on News Reports Regarding LPG Refill Booking Timelines

