Volunteers Jobs : రాష్ట్రంలో 10,909 వాలంటీర్ల నియామకం.. పూర్తి వివరాలు
Telangana Government Volunteers Recruitment For Yasangi Crop Survey All Details In Telugu : ప్రతి గ్రామంలో స్థానికంగా నివసిస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. రోజుకు 1500 సంపాదించుకునే సువర్ణ అవకాశం తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు కల్పిస్తుంది.. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కేంద్రం యాసంగి పంట సర్వే కోసం ఉన్న AEO తో సర్వే చేపిస్తే మూడు నెలల్లో గడువు పడుతుంది. పంటల నమోదు సర్వే కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున 10,909 మందిని నియమించాలని తెలంగాణ వ్యవసాయశాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ప్రతి గ్రామంలో స్థానికంగా నివసిస్తున్న అభ్యర్థులను వాలంటరీగా ఎంచుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు వారు 150 నుంచి 200 సర్వే నెంబర్ కు సంబంధించి పంట పొలాల ఫోటోలు తీసి యాప్ లో ఫోటోలు అప్లోడ్ చేయాలి మొబైల్ ద్వారా అలా చేస్తే అమౌంట్ కూడా ఇస్తారు.
ఈ వాలంటరీ ఉద్యోగాలకు టెన్త్ లేదా ఇంటర్మీడియట్, డిగ్రీ & బీఎస్సీ అగ్రికల్చర్ డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు గ్రామ భూముల పై అవగాహన కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. మొబైల్ అప్లికేషన్ గురించి అవగాహన కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఒక్కో ఫొటోకు రూ.7 నుంచి రూ. 10 వరకు చెల్లిస్తారు. 45 రోజుల యాసంగి సీజన్లో 2000 ఫోటోల వరకు అప్లోడ్ చేయవచ్చు.

అర్హత కలిగిన అభ్యర్థులు విద్యార్హత పత్రాలతో మండల వ్యవసాయ అధికారుల దగ్గర అప్లికేషన్ చేసుకోవాలి.

