12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy
CBSE Recruitment 2025 Latest Junior Assistant, Junior Accountant & Assistant Secretary Notification 2025 Apply Now: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్, అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్, జూనియర్ అకౌంటెంట్ & జూనియర్ అసిస్టెంట్ 124 పోస్టుల కోసం అఖిల భారత పోటీ పరీక్ష ఆధారంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా పరీక్ష 2026 (DRQ2026) కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ (22.12.2025న లేదా అంతకు ముందు 11.59 P.M. వరకు)లో https://www.cbse.gov.in/ లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) లో అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్ (విద్యా శాస్త్రం/శిక్షణ/ నైపుణ్య విద్య), అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 12th, డిగ్రీ ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వయసు 18 సంవత్సరాలు నుంచి 35 మధ్యలో కలిగి ఉండాలి. సొంత రాష్ట్రంలో రాతపరీక్ష మరియు పోస్టింగ్ వస్తుంది అప్లై కాని చేసుకున్నట్లయితే. పర్మనెంట్ ఉద్యోగాలు రావడం జరిగింది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్ https://www.cbse.gov.in/ ద్వారా డిసెంబర్ 02, 2025 తేదీ నుంచి డిసెంబర్ 22, 2025లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

CBSE Junior Assistant, Junior Accountant & Assistant Secretary Job Recruitment 2025 Apply 124 Vacancy Overview :
సంస్థ పేరు :: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్ (విద్యా శాస్త్రం/శిక్షణ/ నైపుణ్య విద్య), అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 124
వయోపరిమితి :: 18 to 35 సంవత్సరాలు
విద్య అర్హత :: 12th, Any డిగ్రీ పాస్ చాలు
నెల జీతం :: రూ.19,900/- to ₹177,500/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 02, 2025
దరఖాస్తుచివరి తేదీ :: డిసెంబర్ 22, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్:: https://www.cbse.gov.in/

»పోస్టుల వివరాలు:
•అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్ (విద్యా శాస్త్రం/శిక్షణ/ నైపుణ్య విద్య), అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 124 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•అసిస్టెంట్ సెక్రటరీ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ.
•అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్ (విద్యా శాస్త్రం/శిక్షణ/ నైపుణ్య విద్య) :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి బి.ఎడ్./ఎం.ఎడ్ లేదా తత్సమానం. NET/SLET, NET-JRF గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి డాక్టరేట్ డిగ్రీ.
•అకౌంట్స్ ఆఫీసర్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఎకనామిక్స్/కామర్స్/అకౌంట్స్/ఫైనాన్స్/బిజినెస్ స్టడీస్/కాస్ట్ అకౌంటింగ్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ మరియు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఖాతా/ఆడిట్ సర్వీసెస్/విభాగం నిర్వహించిన SAS/JAO(C) పరీక్షలో ఉత్తీర్ణత. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఎకనామిక్స్/కామర్స్/అకౌంట్స్/ఫైనాన్స్/బిజినెస్ స్టడీస్/లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. కాస్ట్ అకౌంటింగ్ ఒక సబ్జెక్టుగా. లేదా ఎం.బి.ఎ. (ఫైనాన్స్)/చార్టర్డ్ అకౌంటెంట్/ఐసిడబ్ల్యుఎ.

•సూపరింటెండెంట్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం. విండోస్, ఎంఎస్-ఆఫీస్, పెద్ద డేటాబేస్ నిర్వహణ, ఇంటర్నెట్ వంటి కంప్యూటర్/కంప్యూటర్ అప్లికేషన్ల పని పరిజ్ఞానం.
•జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీలో మాస్టర్స్ డిగ్రీ, ఇంగ్లీషును తప్పనిసరి లేదా ఎంపిక చేసిన సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా ఉత్తీర్ణత. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీ, హిందీని తప్పనిసరి లేదా ఎంపిక చేసిన సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా ఉత్తీర్ణత.

•జూనియర్ అకౌంటెంట్ :: గుర్తింపు పొందిన బోర్డు/ విశ్వవిద్యాలయం/ సంస్థ నుండి 12వ తరగతిలో అకౌంటెన్సీ/ బిజినెస్ స్టడీస్/ ఎకనామిక్స్/ కామర్స్/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్/ ఫైనాన్స్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ టాక్సేషన్/ కాస్ట్ అకౌంటింగ్ ఒక సబ్జెక్టు. మరియు ఇంగ్లీషులో గంటకు 35 పదాలు లేదా కంప్యూటర్‌లో 30 పదాలు టైపింగ్ వేగం.
•జూనియర్ అసిస్టెంట్ :: గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి లేదా తత్సమాన అర్హత. కంప్యూటర్‌లో ఇంగ్లీషులో నిమిషాలకు 35 పదాలు లేదా హిందీలో నిమిషాలకు 30 పదాలు టైపింగ్ వేగం (ప్రతి పదానికి సగటున 5 కీ డిప్రెషన్‌లలో 35 పదాలు మరియు నిమిషాలకు 30 పదాలు 10500 KDPH/9000 KDPHకి అనుగుణంగా ఉంటాయి).

»నెల జీతం :
•అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్ (విద్యా శాస్త్రం/శిక్షణ/ నైపుణ్య విద్య) & అకౌంట్స్ ఆఫీసర్: ₹56,100/- to ₹177,500/-
•సూపరింటెండెంట్ & జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్ : Rs. 35,400 to Rs. 1,12,400/-
•జూనియర్ అకౌంటెంట్ & జూనియర్ అసిస్టెంట్ : ₹19,900/- to ₹63,200/- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: దరఖాస్తు ముగింపు తేదీ అంటే 22.12.2025 నాటికి అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. వయోపరిమితిలో సడలింపు పొందడానికి అనుమతించదగిన గరిష్ట వయోపరిమితి సడలింపు ఈ క్రింది విధంగా ఉంది.
•అసిస్టెంట్ సెక్రటరీ పోస్టుకు 35 సంవత్సరాలు
•అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్ (విద్యా శాస్త్రం/శిక్షణ/ నైపుణ్య విద్య) పోస్టుకు 30 సంవత్సరాలు
•అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుకు 35 సంవత్సరాలు
•సూపరింటెండెంట్ & జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్ పోస్టుకు 35 సంవత్సరాలు
•జూనియర్ అకౌంటెంట్ & జూనియర్ అసిస్టెంట్ : పోస్టుకు 27 సంవత్సరాలు గరిష్ట వయసులోపు ఉండాలి.
»దరఖాస్తు రుసుము :: అభ్యర్థులు దరఖాస్తు/ప్రాసెసింగ్ రుసుములను ఈ క్రింది విధంగా ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చెల్లించాలి:-
•SC/ST/PwBD/మాజీ సైనికులు/మహిళలకు : 250/-
•అన్‌రిజర్వ్డ్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కోసం : ₹1050 to ₹1750/- మధ్య అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

»ఎంపిక విధానం: టైర్-1: MCQ ఆధారిత ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష.
టైర్-2: ఆబ్జెక్టివ్ టైప్ (OMR ఆధారిత) & డిస్క్రిప్టివ్ టైప్ రాత ప్రధాన పరీక్ష.
టైర్-3: ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : ఆన్‌లైన్ దరఖాస్తును CBSE వెబ్‌సైట్ https://www.cbse.gov.in/cbsenew/cbse.html లో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ దరఖాస్తుప్రారంభ తేదీ: 02 డిసెంబర్ 2025 నుండి
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: (22.12.2025న లేదా అంతకు ముందు 11.59 P.M. వరకు)

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here

