పరీక్ష లేదు, ఫీజు లేదు : డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | Latest AP WDCW Data Entry Operator Notification 2025 Apply Now
AP WDCW Recruitment 2025 Latest Data Entry Operator Notification 2025 Apply Now : నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేదు, ఫీజు లేదు అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం. ఆంధ్రప్రదేశ్ లో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము లో డిటిఏ ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగుల కోసం దరఖా ఆహ్వానం. ఆఫ్ లైన్ లో 20 నవంబర్ 2025 లోపు అప్లై చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో జిల్లా గృహహింస చట్ట విభాగము యందు ఖాళీగా యున్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టునకు ఔట్సోర్సింగ్ పద్దతిన భర్తీ చేయుటకు గాను అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. వయసు 42 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. దృవీకరణ పత్రములు జతపరచి 11.11.2025 నుండి 20.11.2025వ తేది సాయంత్రం 05.00 గంటలలోపు కార్యాలయ పని దినములు మరియు పని వేళల యందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము వెంటనే అప్లై చేసుకోవాలి.

పోస్టు వివరాలు : డేటా ఎంట్రీ ఆపరేటర్= 01 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్. కంప్యూటర్లలో డిప్లొమా లేదా కంప్యూటర్లలో పిడి డిప్లొమా. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత.
జీతం : రూ.18500 నెల జీతం.
వయోపరిమితి : 25సం. ల నుండి 42 సం.ల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు కలదు.
దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంలను https://kadapa.ap.gov.inవెబ్ సైట్ నుండి పొందగలరు. అర్హత మరియు నిర్ణయ ప్రమాణాల ప్రకారము అన్ని అర్హతలున్న అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత దృవీకరణ పత్రములు జతపరచి 11.11.2025 నుండి 20.11.2025వ తేది సాయంత్రం 05.00 గంటలలోపు కార్యాలయ పని దినములు మరియు పని వేళల యందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, డి-బ్లాక్, క్రొత్త కలెక్టరేట్, కడప, వై.యస్.ఆర్. జిల్లా యందు సమర్పించవలయును.
గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు మరియు అసంపూర్తిగా సమర్పించిన దరఖాస్తులను, మరియు సంబంధిత దృవీకరణ పత్రములు జతపరుచని యెడల సదరు దరఖాస్తులను పరిగణలోనికి తీసుకొనబడవు. అర్హతా ప్రమాణాలననుసరించి కుదించబడిన జాబితాలోని అభ్యర్థులను మాత్రమే ఎంపిక ఇంటర్వ్యూనకు పిలువబడుదురు. మరియు నియామకములు జరుపు తేదీ నాటికి అమలులో యున్న/జారీ చేయబడు నిబంధనల ప్రకారము ఈ నియామకములు జరుగును.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ :: 11 నవంబర్ 2025.
•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ:: 20 నవంబర్ 2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑 Application Pdf Click Here

