Anganwadi Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో అంగన్వాడీ కేంద్రం లో 4687 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
Anganwadi Teacher, Mini Teacher & Anganwadi helper district wise job notification all details in Telugu :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో 10th పాస్ అయినా 4687 మంది మినీ అంగన్వాడీ టీచర్ ను ప్రధాన అంగన్వాడీ టీచర్ గా ప్రమోషన్ ఇస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 12 ICDS ప్రాజెక్ట్ పరిధిలోని 28 అంగన్వాడీ టీచర్, 168 అంగన్వాడీ హెల్పర్లకు పదో తరగతి పాసైన అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 లోగా అర్హులైన మహిళా అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన 4687 మంది మినీ అంగన్వాడీ టీచర్ను అప్గ్రేడ్ చేయడం ద్వారా నెలకు రూ.11,500/- గౌరవ వేతనంతో ప్రధాన అంగన్వాడీ టీచర్ గా అప్గ్రేడ్ చేస్తారు. 4687 మెనీ అంగన్వాడీ కార్యకర్తలను త్వరలో భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో అంగనవాడి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈనెల 26 లోపల అప్లై చేసుకోవాలి.
విద్య అర్హత : కేవలం 10వ తరగతి పాసైన మహిళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, 01 జూలై 2025 నాటికి 21 సంవత్సరాలు నిండి, 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. వివాహిత మహిళ అయి ఉండాలని, అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ ఆయా పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రోస్టర్ ప్రకారం ఎంపిక చేస్తారు.
జతపరచవలసిన ధృవ పత్రములు:-
1. Date of Birth Certificate
2. కుల దృవీకరణ పత్రము (SC, ST & OBC)
3. 10th విద్యార్హత దృవీకరణ పత్రము
4. నివాస స్థల ధృవీకరణ పత్రము
5. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రము
6. వికలాంగులు అయినచో పి. హెఎచ్ సర్టిఫికేట్
7. ఆథారు కార్డ్ మరియు
8. రేషన్ కార్డు
జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 28 అంగన్వాడీ టీచర్ & 168 అంగన్వాడి హెల్పర్ పోస్టులు మొత్తం 196 ఖాళీల వివరాలను ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో తమ దగ్గర ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో నోటీస్ బోర్డ్ లో కాళీ వివరాలు ఉంటాయి చెక్ చేసి, ఆ తర్వాత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Letter Click Here