తల్లికి వందనం పథకం కొత్త అర్హత సమాచారం | Talliki Vandanam scheme in Telugu 

తల్లికి వందనం పథకం కొత్త అర్హత సమాచారం | Talliki Vandanam scheme in Telugu 

Talliki Vandanam  scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని తెలియజేయడం జరిగింది. పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరమవ్వకుండా ఉండాలని ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తుంది, డ్రాపౌట్ రేటును గణనీయంగా తగ్గిస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తల్లికి వందనం పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్ 2nd ఇయర్ ) వరకు చదువుతున్న తల్లులకు ప్రభుత్వం నేరుగా రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. BPL (Below Poverty Line)  కుటుంబాలకు చెందిన వారై ఉండాలి. దీనికిగాను రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.

Talliki Vandanam  scheme required documents  

  • నివాస ధృవీకరణ సర్టిఫికెట్ 
  • ఆధార్ కార్డ్
  • రేషన్ కార్డు
  •  కుటుంబ ఇన్కమ్ సర్టిఫికేట్ 
  • మొబైల్ నంబర్ (ఆధార్ కార్డు లింక్ లింక్ ఉండాలి)
  • బ్యాంక్ పాస్ బుక్
  • కొత్త గా పాస్పోర్ట్ సైజు ఫోటో

విద్యార్థుల హాజరు తప్పనిసరిగా 75% మించి ఉండవలెను. ఆధార కార్డు ధ్రువీకరణ ద్వారా ఈ పథకానికి సంబంధించి ధ్రువీకరణ ఉంటుంది కావున తల్లులకు/ సంరక్షకులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను. పూర్తి విధి విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది. ప్రస్తుతానికి తల్లికి వందనం పథకం సంబంధించి ఆధార ధ్రువీకరణకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది.

🔴GO Letter No Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page