ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ శిక్షణ.. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులకు అవకాశం | TSRTC Secunderabad Apprenticeship 2026
TSRTC Secunderabad Apprenticeship 2026 Apply Now : సికింద్రాబాద్ ఆర్టీసీ రీజియన్లో అప్రెంటిస్షిప్ శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. 2023, 2024, 2025, 2026 సంవత్సరాల్లో ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసినవారు ఈ శిక్షణకు అర్హులని రీజినల్ మేనేజర్ సుచరిత తెలిపారు.

ముఖ్యమైన వివరాలు
• సంస్థ : ఆర్టీసీ, సికింద్రాబాద్ రీజియన్
• అవకాశం : అప్రెంటిస్షిప్ శిక్షణ
• అర్హత : ఐటీఐ, డిప్లొమా, బీటెక్
• అర్హత పూర్తి చేసిన సంవత్సరాలు : 2023–2026
• సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు : అక్టోబర్ 28, 29
• సమయం : ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
• వేదిక : జూబ్లీ బస్ స్టేషన్లోని ప్రాంతీయ కార్యాలయం
అర్హతలు ఏమిటి : 2023 నుంచి 2026 మధ్య ఐటీఐ, డిప్లొమా లేదా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశానికి సంబంధించిన అర్హతలను పరిశీలించుకోవాలి. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే ముందు NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని అధికారులు సూచించారు.
NATS రిజిస్ట్రేషన్ లింక్: https://nats.education.gov.in/
తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు : సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లే అభ్యర్థులు ఈ పత్రాలను సిద్ధం చేసుకోవాలి.
• ఎస్సెస్సీ మెమో
• ఐటీఐ / డిప్లొమా / బీటెక్ మెమోలు
• ప్రొవిజనల్ సర్టిఫికెట్
• ఆధార్ కార్డు
• కుల ధ్రువీకరణ పత్రం
• బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ కాపీ
• NATS రిజిస్ట్రేషన్ కాపీ

ఎక్కడ, ఎప్పుడు హాజరుకావాలి : అర్హులైన అభ్యర్థులు సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ ప్రాంతీయ కార్యాలయంలో అక్టోబర్ 28, 29 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. వెళ్లే ముందు అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేసుకుని, అధికారిక ప్రకటనలోని సూచనలను మరోసారి పరిశీలించడం మంచిది.

