Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో 65 సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
Supreme Court Senior Personal Assistant Recruitment 2026 Apply Now : భారత సుప్రీంకోర్టులో ఉద్యోగం చేయాలనుకునే డిగ్రీ అభ్యర్థులకు మంచి అవకాశం. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ 65 సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (Senior Personal Assistant) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 20, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి నవంబర్ 10, 2026 చివరి తేదీగా ప్రకటించారు.
భారత సుప్రీంకోర్టులో 65 సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్, కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రారంభ మూల వేతనం రూ.47,600. ఆన్‌లైన్ దరఖాస్తులు 2026 అక్టోబర్ 20 నుంచి నవంబర్ 10 వరకు స్వీకరిస్తారు. ఈ నియామకం ద్వారా భర్తీ చేసే పోస్టులు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్). ఎంపికైన వారికి పే మ్యాట్రిక్స్ లెవెల్-8 ప్రకారం నెలకు రూ.47,600 ప్రారంభ మూల వేతనం లభిస్తుంది. దీనికి నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు అదనంగా ఉంటాయి.

విద్యార్హతల : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 110 పదాల వేగం, కంప్యూటర్‌పై ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషానికి కనీసం 40 పదాల వేగం ఉండాలి.
వయోపరిమితి : 2026 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్), దివ్యాంగులు, మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పనిచేసే విభాగీయ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి వర్తించదని ప్రకటనలో పేర్కొన్నారు.
ఎంపిక విధానం : అభ్యర్థుల ఎంపికలో ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష, ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ పరీక్ష, కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఆబ్జెక్టివ్ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, భారత రాజ్యాంగంలోని న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశాలు, సుప్రీంకోర్టు రూల్స్-2013, కంప్యూటర్ పరిజ్ఞానంపై ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి గంటన్నర.
షార్ట్‌హ్యాండ్ పరీక్షకు 100 మార్కులు కేటాయించారు. నిమిషానికి 110 పదాల వేగంతో ఇంగ్లీష్ డిక్టేషన్ తీసుకోవాలి. దీనికి ఏడు నిమిషాల సమయం ఉంటుంది. లిప్యంతరీకరణకు 45 నిమిషాలు ఇస్తారు.
కంప్యూటర్‌పై ఇంగ్లీష్ టైపింగ్ పరీక్ష 10 నిమిషాలు ఉంటుంది. ఇందులో నిమిషానికి కనీసం 40 పదాల టైపింగ్ వేగం అవసరం. తదుపరి దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్షల కనీస అర్హత మార్కులు, ఇతర నిబంధనలను అధికారిక ప్రకటనలో పరిశీలించాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1,500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్), మాజీ సైనికులు, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. బ్యాంక్ ఛార్జీలు అదనంగా ఉండవచ్చు. ఫీజును ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి. దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లించబడదు.
దరఖాస్తు తేదీలు
• ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 20 అక్టోబర్ 2026.
• దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10 నవంబర్ 2026, రాత్రి 11:55 గంటలు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : అర్హత ఉన్న అభ్యర్థులు భారత సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్ www.sci.gov.in ను సందర్శించాలి. అక్కడ రిక్రూట్‌మెంట్ విభాగంలో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ నియామక ప్రకటనను తెరిచి, సూచనలను చదివి ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి. అవసరమైన వివరాలు నమోదు చేసి, ఫీజు చెల్లించి, దరఖాస్తును సమర్పించాలి.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
