విద్యుత్ శాఖలో NTPCలో 15 అసిస్టెంట్ ఉద్యోగాలు.. ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేయండి
NTPC Assistant Jobs 2026 15 Posts Apply Online: నిరుద్యోగులకు శుభవార్త.. నేషనల్ తెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లో అసిస్టెంట్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) పోస్టులకు 15 ఖాళీలు ఉన్నాయి. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 05 అక్టోబర్ 2026 లోపు అప్లై చేయాలి.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ NTPC Limited ఉద్యోగాల కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగంలో అసిస్టెంట్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం 15 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. NTPC దేశంలోని ప్రముఖ విద్యుత్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. అర్హత, వయోపరిమితి, జీతం, ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు తేదీలు తెలుసుకోండి.

•పోస్టుల వివరాలు : ఈ నియామకంలో అసిస్టెంట్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) పోస్టుకు మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. వీటిలో UR కేటగిరీకి 8, EWSకు 1, OBCకు 3, SCకు 2, STకు 1 పోస్టు కేటాయించారు. సంస్థ అవసరాలను బట్టి ఖాళీల సంఖ్యలో మార్పులు చేసే అవకాశం NTPCకి ఉంటుంది.
•విద్యార్హత ఏమిటి : ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో పూర్తికాల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదనంగా అదే విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, అడ్వర్టైజింగ్ & కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్ లేదా సంబంధిత కలయికలో రెండేళ్ల పూర్తికాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా PG డిప్లొమా కలిగి ఉండాలి. ఈ అర్హతలో కూడా కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.
వయోపరిమితి : ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ట వయస్సు 29 సంవత్సరాలు. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం ఎంత : ఎంపికైన అభ్యర్థులకు E0 గ్రేడ్ కింద IDA పే స్కేల్ రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు ఉంటుంది. ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు సంస్థ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ : NTPC అవసరాన్ని బట్టి బహుళ దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించవచ్చు. ఇందులో షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితర దశలు ఉండవచ్చు. అభ్యర్థులు రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలోనూ విడివిడిగా అర్హత సాధించాల్సి ఉంటుంది.
ఉద్యోగం ఎక్కడ ఉంటుంది : ఎంపికైన అభ్యర్థులను NTPCకి చెందిన కార్యాలయాలు, స్టేషన్లు, ప్రాజెక్టులు, జాయింట్ వెంచర్లు లేదా అనుబంధ సంస్థల్లో పోస్టింగ్ చేయవచ్చు. సంస్థ అవసరాలను బట్టి ఉద్యోగ స్థలం మారే అవకాశం ఉంటుంది.
•దరఖాస్తు ఫీజు : General, EWS, OBC కేటగిరీల అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC, ST, PwBD, Ex-Servicemen కేటగిరీలతో పాటు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
•అవసరమైన పత్రాలు : దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. పదో తరగతి సర్టిఫికేట్ లేదా మార్క్‌షీట్, PAN కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా PG డిప్లొమా సర్టిఫికేట్, మార్క్షీట్లు లేదా ట్రాన్స్క్రిప్ట్ తదితర పత్రాలు అవసరం.
•వైద్య పరీక్ష : ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరే ముందు NTPC మెడికల్ బోర్డు లేదా సంస్థ అధీకృత వైద్యాధికారి నిర్వహించే వైద్య పరీక్షకు హాజరు కావాలి. సంస్థ నిర్దేశించిన వైద్య ప్రమాణాలను అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలి.
•ముఖ్యమైన తేదీలు : NTPC నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 21 సెప్టెంబర్ 2026 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 5 అక్టోబర్ 2026గా పేర్కొన్నారు.
•ఎలా దరఖాస్తు చేయాలి : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు NTPC అధికారిక కెరీర్ వెబ్సైట్ careers.ntpc.co.in ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌లోని విద్యార్హత, వయస్సు, కేటగిరీ, ఫీజు, పత్రాలు, వైద్య ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ తదితర నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

