సైనిక్ స్కూల్‌లో ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు.. 10th అర్హతతో అవకాశం Sainik School Lab Assistant & Attender Recruitment 2026

సైనిక్ స్కూల్‌లో ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు.. 10th అర్హతతో అవకాశం Sainik School Lab Assistant & Attender Recruitment 2026

Sainik School Kapurthala Lab Assistant & Attender Recruitment 2026: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర రక్షణ శాఖ మంత్రితో ఆధ్వర్యంలో ఉన్న కపుర్తలా సైనిక్ స్కూల్‌లో వివిధ ఉద్యోగాలకు భర్తీకి నియామక ప్రకటన విడుదలైంది. ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ), ల్యాబ్ అసిస్టెంట్ (ఫిజిక్స్), జనరల్ ఎంప్లాయీ (GE) ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ నియామకాల్లో ఉద్యోగాలు బట్టి 10వ తరగతి, ఇంటర్మీడియట్ అర్హతలతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారికి అవకాశం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి. దరఖాస్తులు చేరడానికి చివరి తేదీ 10 అక్టోబర్ 2026.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పోస్టుల వివరాలు, విద్యార్హతలు, జీతభత్యాలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Sainik School Kapurthala Recruitment 2026 ముఖ్యమైన వివరాలు

• సంస్థ పేరు : సైనిక్ స్కూల్ కపుర్తలా
• నియామక విధానం : రెగ్యులర్ / కాంట్రాక్ట్
• పోస్టులు : ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ), ల్యాబ్ అసిస్టెంట్ (ఫిజిక్స్), జనరల్ ఎంప్లాయీ (GE)
• అర్హత : 10వ తరగతి, ఇంటర్మీడియట్ తదితరాలు
• దరఖాస్తు విధానం : 10 అక్టోబర్ 2026
• అధికారిక వెబ్‌సైట్ : www.sskapurthala.కమ్

మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి :  సైనిక్ స్కూల్ కపుర్తలా నియామక ప్రకటనలో ల్యాబ్ అసిస్టెంట్, జనరల్ ఎంప్లాయీ విభాగాల్లో ఖాళీలను ప్రకటించారు.

ప్రకటనలో పేర్కొన్న పోస్టుల వివరాలు:
• ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) – 01 పోస్టు
• ల్యాబ్ అసిస్టెంట్ (ఫిజిక్స్) – 01 పోస్టు
• జనరల్ ఎంప్లాయీ (GE) – 04 పోస్టులు
• ఫిజిక్స్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు 11 నెలల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుందని.

విద్యార్హతలు

•ల్యాబ్ అసిస్టెంట్ : ఇంటర్మీడియట్ సైన్స్‌లో కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్ సంబంధిత సబ్జెక్టుగా ఉండాలి లేదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న సమానమైన అర్హత కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇంగ్లీష్‌లో మాట్లాడగల సామర్థ్యం. కంప్యూటర్ అప్లికేషన్లపై పరిజ్ఞానం. NCC, క్రీడలు, ఆటలు లేదా ఇతర పాఠ్యేతర కార్యక్రమాల్లో సాధించిన విజయాలు. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు 01 సెప్టెంబర్ 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జనరల్ ఎంప్లాయీ (GE) ఉద్యోగాలు
సైనిక్ స్కూల్ కపుర్తలాలో జనరల్ ఎంప్లాయీ విభాగంలో మొత్తం 04 పోస్టులు ప్రకటించారు.

• కుక్ : 03 పోస్టులు
• కార్పెంటర్ : 01 పోస్టు

•కుక్ ఉద్యోగానికి అర్హతలు : కుక్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వంట పనిలో అనుభవం ఉండాలి. ముఖ్యంగా పేరున్న హోటల్ లేదా రెసిడెన్షియల్ స్కూల్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

•కార్పెంటర్ ఉద్యోగానికి అర్హతలు : కార్పెంటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వడ్రంగి పనిలో తగినంత అనుభవం ఉండాలి. పంజాబీ, హిందీ భాషలపై అవగాహన. సైనిక్ స్కూల్‌లో 7 సంవత్సరాలకు పైగా పనిచేసిన అనుభవం ఉన్నవారికి అదనపు ప్రయోజనం. సంబంధిత పనిలో నైపుణ్యం, అనుభవం ఉడాలి.

వయోపరిమితి : జనరల్ ఎంప్లాయీ పోస్టులకు 01 సెప్టెంబర్ 2026 నాటికి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

జీతభత్యాలు ఎంత : సైనిక్ స్కూల్ కపుర్తలా ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతభత్యాలు చెల్లిస్తారు. పోస్టు / పే వివరాలుజీతంల్యాబ్ అసిస్టెంట్ పే లెవల్ 4ప్రారంభ బేసిక్ పే రూ.25,500 + 60% DAGE పే లెవల్ 1ప్రారంభ బేసిక్ పే రూ.18,000ల్యాబ్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ పోస్టునెలకు రూ.40,800/- ఏకీకృత వేతనం
సైనిక్ స్కూల్స్ సొసైటీ నియమ నిబంధనల ప్రకారం, అర్హత మరియు అందుబాటును బట్టి DA, రవాణా భత్యం, వైద్య భత్యం, అద్దె రహిత వసతి వంటి ప్రయోజనాలు ఉండవచ్చు.

దరఖాస్తు ఫీజు

అభ్యర్థులు తమ కేటగిరీ ప్రకారం నాన్-రిఫండబుల్ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో దరఖాస్తు ఫీజు చెల్లించాలి. కేటగిరీఫీజుజనరల్ / OBCరూ.500/-SC / STరూ.250/-. డిమాండ్ డ్రాఫ్ట్‌ను “Sainik School Fund Account” పేరుతో జారీ చేయాలి.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : సైనిక్ స్కూల్ కపుర్తలా నియామక ప్రకటన ప్రకారం ఎంపిక ప్రక్రియలో ఈ దశలు ఉంటాయి:

• దరఖాస్తుల పరిశీలన.
• అర్హులైన అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్.
• రాత పరీక్ష.
• పోస్టును బట్టి నైపుణ్య పరీక్ష / ప్రాక్టికల్ పరీక్ష.
• అసలు విద్యా, వృత్తిపరమైన ధ్రువపత్రాల పరిశీలన.

రాత పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల పేర్లు, పరీక్ష తేదీని పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా కూడా సమాచారం అందిస్తారు.
ఎంపిక ప్రక్రియకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకెళ్లాలి.

దరఖాస్తు చేసుకునే విధానం : ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి నిర్దేశిత అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి వివరాలతో నింపాలి.

అప్లికేషన్ ప్రాసెస్

• ముందుగా సైనిక్ స్కూల్ కపుర్తలా అధికారిక వెబ్‌సైట్ www.sskapurthala.com ను సందర్శించండి.
• Recruitment / Notification విభాగంలో సంబంధిత నియామక ప్రకటనను పరిశీలించండి.
• నిర్దేశిత దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
• అభ్యర్థి పేరు, చిరునామా, విద్యార్హతలు, అనుభవం, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలను సరిగ్గా నమోదు చేయండి.
• అవసరమైన విద్యా, వృత్తిపరమైన సర్టిఫికెట్ల ధృవీకరించిన కాపీలను జత చేయండి.
• కేటగిరీ ప్రకారం డిమాండ్ డ్రాఫ్ట్‌ను జత చేయండి.
• దరఖాస్తులో మీరు అప్లై చేస్తున్న పోస్టు పేరును స్పష్టంగా పేర్కొనండి.
• పూర్తి చేసిన అప్లికేషన్‌ను చివరి తేదీలోపు పోస్టు ద్వారా పంపించండి.

దరఖాస్తు పంపించాల్సిన చిరునామా
The Principal,
Sainik School,
Kapurthala, Punjab – 144 601.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చేరడానికి చివరి తేదీ : 10 అక్టోబర్ 2026

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *