AP New NTR Bharosa pensions : కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిబంధనలు సడలింపు.. రేపటి నుంచి అమలు
AP New NTR Bharosa pensions Scheme 2026 House tax assessment number is not mandatory : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక శుభవార్త తీసుకువచ్చింది.. రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ కేంద్రాల్లో కొత్త దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ భాగంగా ఇంటి పన్ను ఎసెస్మెంట్ నంబర్ తప్పనిసరి కాదు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సామాజిక భద్రత పెన్షన్ అర్హులైన పట్టణ ప్రాంతాల్లో హౌసింగ్ టాక్స్ ఎసెస్మెంట్ నంబర్ నమోదుకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. సోమవారం నుంచి స్వర్ణ వార్డు సచివాలయంలో కొత్త పెన్షన్ దరఖాస్తు సందర్భంగా ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెంచిన మంజూరు దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఈ మేరకు స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ సచివాలయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఇది అమలులోకి రానున్నది.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కొరకు కావలసిన పత్రాలు
1.ఆధార్ జెరాక్స్
2.రైస్ కార్డు జెరాక్స్
3.ఓటర్ కార్డు జెరాక్స్
4.కుల ధ్రువీకరణ పత్రం జెరాక్స్
5 ఆదాయ ధ్రువీకరణ పత్రం జెరాక్స్
6.కరెంటు మీటర్ నెంబర్(ఓన్/రెంట్)
7. ఇంటిపన్ను నెంబర్(ఓన్/రెంట్)
8. ఆధార్ లింకైన ఫోన్
9. ఆధార్ అప్డేట్ హిస్టరీ
10. భర్త డెత్ సర్టిఫికెట్ (వితంతు పెన్షన్ కొరకు)
11.సదరం సర్టిఫికెట్ (వికలాంగుల పెన్షన్ కొరకు)
పై చెప్పినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయంలో ఈనెల 16 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత 17 నుంచి 21 మధ్యలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 25 నుంచి 26 తేదీలలో పెన్షన్ ప్రభుత్వం ఆమోదం తెలుపుతారు. దరఖాస్తు కోసం కేంద్రం వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారు. అప్లై చేసుకున్న వారికి అర్హులైతే ఒకటి అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుపుతున్నారు. తప్పకుండా కొత్త పెన్షన్ కోసం ముఖ్యంగా వితంతులు వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, మత్స్యకారులు చేనేత కార్మికులు, డబ్బు కార్మికులు, చెప్పులు కుట్టేవారు, కళ్ళు గీత కార్మికులు & ట్రాన్స్ జెండర్లు మీరందరూ అప్లై చేసుకోవచ్చు.

📄 Application Form For New Pensions – Download

