TGSRTC Jobs : రాత పరీక్ష లేకుండా RTCలో నోటిఫికేషన్ వచ్చేసింది | TGSRTC Driver & Conductor Job Recruitment 2026 Apply Now
TGSRTC Driver & Conductor Latest Job Notification 2026 Apply Now : TGSRTC సమ్మె నేపథ్యంలో తాత్కాలిక ప్రతిపాదికన డ్రైవర్లు మరియు కండక్టర్ల నియామకం. ఆదిలాబాద్ రీజియన్ పత్రిక ప్రకటన చేయడం జరిగింది.
TGSRTC కార్మికులు 22.04.2026 నుండి ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆదిలాబాద్ రీజినల్ సమ్మె చేపట్టిన నేపథ్యంలో, మేనేజర్ కార్యాలయం తాత్కాలిక నియామకాలకు శ్రీకారం చుట్టింది. సమ్మె కాలంలో బస్సులను నడపడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది.

అర్హతలు మరియు వేతన వివరాలు:
•డ్రైవర్ (Driver) పోస్టుకు : హెవీ వెహికల్ లైసెన్స్ (Heavy License) కలిగి ఉండాలి. లైసెన్స్ పొంది కనీసం 18 నెలల అనుభవం పూర్తి అయి ఉండాలి. హెవీ లోడ్ వాహనాలను నడపడంలో నైపుణ్యం ఉండాలి. RTO మరియు RTC అధికారులు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రధాన్యత ఇవ్వబడుతుంది. రోజువారీ వేతనం: రూ.1,000/-
•కండక్టర్ (Conductor) పోస్టుకు : కనీసం 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి. రోజువారీ వేతనం: రూ. 800/-
ముఖ్య సూచనలు: ఈ నియామకాలు కేవలం సమ్మె కాలానికి మాత్రమే వర్తిస్తాయి.
ఎక్కడ అప్లై చేసుకోవాలి : ఆసక్తి గల అభ్యర్థులు తమ అసలు ధృవీకరణ పత్రాలతో (Original Certificates) సంబంధిత ఆదిలాబాద్ రీజియన్ డిపో మేనేజర్ (Depot Managers) వెంటనే సంప్రదించవలసిందిగా కోరడమైనది.


