RTC Conductor & Driver Jobs : ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానం
RTC Conductor & Driver job notification 2026 all details in Telugu : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగుల చేపట్టిన సమ్మె కారణంగా సామాన్య ప్రజలకు రవాణా పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా మెదక్ & నర్సాపూర్ డిపో పరిధిలో తాత్కాలిక పద్ధతి పైన డ్రైవర్లు కండక్టర్ నియామకాల కోసం నిర్ణయించేందుకు మెదక్ డిపో మేనేజర్ సురేఖ గారు ఒక ప్రకటన చేశారు.
మెదక్ డిపోలో డ్రైవర్ నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డ్రైవర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీస అర్హత 18 నెలల అనుభవం కలిగిన, హెవీ డ్రైవింగ్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. భారీ వాహనాల నడపడంలో తగిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే తమ వర్జినల్ లైసెన్సు ఇతర డాక్యుమెంట్ వివరాలు తీసుకొని మెదక్ డిపో కార్యాలయంలో హాజరుకావాలని మేనేజర్ గారు సూచించారు.
నర్సాపూర్ డిపోలో డ్రైవర్ తో పాటు కండక్టర్ తాత్కాలిక ప్రతిపాదికన నియామకాలు కూడా చర్యలు చేపట్టారు. డ్రైవర్ ఉద్యోగం కోసం పదో తరగతితో అర్హతతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, 18 నెల కాలవ్యవధి అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కండక్టర్ ఉద్యోగానికి కేవలం 10వ తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే నర్సాపూర్ డిపో కార్యాలయ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. డ్రైవర్ ఉద్యోగాలకు ప్రతిరోజు వెయ్యి రూపాయలు చెల్లిస్తారు కండక్టర్ ఉద్యోగాలకు 800 రూపాయలు రోజువారికి చెల్లిస్తారు.


