AP Inter Supplementary Exams 2026 : AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?
AP Inter Supplementary Exams 2026 schedule Date & Time all details in Telugu : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల తేదీలు బోర్డు ప్రకటించారు. ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు మే 21వ తేదీ నుంచి జూన్ 4 వరకు 2 షిఫ్ట్ లో ఉదయం 9 am నుంచి 12:00 p.m వరకు సాయంత్రం 02:30 p.m నుంచి 5:30p.m వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్ జూన్ ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మరియు రి వెరిఫికేషన్ మరియు రికౌంటింగ్ కోసం ఈ నెల 20 నుంచి 27 మధ్యలో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

2026 సంవత్సరం లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎక్సమినేషన్స్ (IPE) ఫలితాలు గత 12 సంవత్సరాలలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించారు. ఇందులో ప్రధమ సంవత్సరంలో 77% మరియు ద్వితీయ సంవత్సరంలో 81% ఉత్తీర్ణత నమోదైంది. ఇది గత 12 సంవత్సరాలలో రెండవ అత్యధిక పనితీరును సూచిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ మరియు ప్రభుత్వ-నిర్వహణ సంస్థలలో ఈ మెరుగుదల గణనీయంగా ఉంది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో (GJC), 1వ సంవత్సరం విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం 54%గా ఉంది, ఇది గత 12 సంవత్సరాలలో అత్యధికం. 2వ సంవత్సరానికి, ఉత్తీర్ణత శాతం 68%గా ఉంది, ఇది గత 12 సంవత్సరాలలో రెండవ అత్యధిక పనితీరును సూచిస్తుంది. ఈ విజయం, విద్యార్థులు, ప్రిన్సిపాల్‌లు, జూనియర్ లెక్చరర్లు మరియు విద్యాపరమైన శ్రేష్ఠత కోసం సంబంధిత వర్గాలన్నీ చేసిన కృషికి నిదర్శనం.
ఏపీ ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష తేదీ వివరాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష తేదీలు ఎప్పుడంటే మే 21 నుంచి జూన్ 4 మధ్యలో రెండు సీట్లు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అలాగే ద్వితీయ సంవత్సరం సెకండ్ సీట్లో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రీ వెరిఫికేషన్ రీకౌంటింగ్ ఎప్పుడు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో రీ వెరిఫికేషన్ మరియు రికౌంటింగ్ కోసం ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

