AP Inter Exam Result 2026 Date : ఏపీలో నేటి నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం.. ఫలితాలు ఎప్పుడంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Exam Result 2026 Date : ఏపీలో నేటి నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం.. ఫలితాలు ఎప్పుడంటే?

AP Inter Exam Result 2026 Latest Update : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ 1వ సంవత్సరం & 2వ సంవత్సరం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో స్పాట్ వెలివేషన్ ప్రక్రియ.. ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు వెల్లడికి సన్నాహాలు చేస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి రంజిత్ భాషా గారు తెలిపారు. మార్చి 25వ తేదీ పరీక్షలు పూర్తిగా ముగిస్తున్న నేపథ్యంలో ఫలితాలు కూడా త్వరలో అధికారికంగా విడుదల చేస్తామని తెలియజేశారు.

ఇంటర్మీడియట్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం ఏర్పాటు చేసేందుకు రంజిత్ భాషా గారు వివరించారు. ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్ష మార్చి 18న ముగించడం జరిగింది. మూల్యాంకనంలో భాగంగా ఒక్కో లెక్చరర్ కు ఉదయం 15, మధ్యాహ్నం 15 చొప్పున జవాబు పత్రాలను దిద్దడానికి ఇస్తున్నారు. విద్యార్థులు రాసినటువంటి హ్యాండ్ రైటింగ్ అర్థం కాలేదని, మార్క్స్ కొట్టేకూడదనేసి మార్క్స్ ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

ఈ సంవత్సరం మూల్యాంకనంలో తప్పులు చేసే లెక్చరర్ పై కఠిన చర్యలు తప్పవని బోర్డు హెచ్చరిస్తుంది. పొరపాట్లు చేసిన వారికి రూ.3,000/- నుంచి రూ.7500/- వరకు, వాటిని పరిశీలించిన వారికి రూ.2000/- నుంచి రూ.3500/- వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. మూల్యాంకనం లో తీవ్రమైన వ్యత్యాసం వచ్చినట్లయితే సంబంధిత లెక్చరులను మూల్యాంకనం నుంచి డీబార్ చేయమని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరం ఇంటర్ 1st &2nd ఇయర్ కలిపి 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఏపీ ఇంటర్మీడియట్ ఒకటవ రెండవ సంవత్సర ఫలితాలు సులువుగా పొందవచ్చు. ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో అధికార వెబ్సైట్ లో bie.ap.gov.in యాక్టివ్ అవుతుంది. ఇంటర్మీడియట్ బోర్డు ఇంకా ఖచ్చితమైన విడుదల తేదీ ధ్రువీకరించలేదు. విద్యార్థులు తమ హాల్టికెట్ నెంబరు మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి తమ ఫలితాల మెమో పొందవచ్చు.

🛑AP Inter Exam Result 2026 Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *