నిరుద్యోగులకు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖలో 150 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
AP DPH&FW Staff Nurse Contract Basis Job Notification 2026 Apply Now :: ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంలో 150 పోస్టుకు కోసం ఒక (1) సంవత్సరం కాలానికి ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయబడే స్టాఫ్ నర్సుల పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ / బి.ఎస్సి (నర్సింగ్) అర్హత ఉన్నవారు 17.03.2026న ఉదయం 10:00 గంటల నుండి నుంచి పూరించిన దరఖాస్తులను సంబంధిత జోన్ యొక్క వైద్య మరియు ఆరోగ్య సేవల ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయంలో 25.03.2026 తేదీన సాయంత్రం 05.00 గంటలలోపు సమర్పించాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన (జోనల్ కేడర్) స్టాఫ్ నర్సుల ఖాళీ పోస్టుల భర్తీ – నోటిఫికేషన్ జారీ చేయబడింది. మొత్తం 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషనన్ను విడుదల చేసింది. డైరెక్టర్ అఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గొల్లపూడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వులు ప్రకారం గుంటూరు జోన్ పరిధి నందు పిడిగురాళ్ల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పల్నాడు. జిల్లా లో ఖాళీగా ఉన్నటువంటి 150 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఒప్పంద విధానం లో భర్తీ చేయుటకు నిర్ణయించటం జరిగినది. ఈ ఉద్యోగాలకు జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ / బి.ఎస్సి (నర్సింగ్) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి, అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మర్చి 17, 2026 నుంచి మర్చి 25, 2026 వరకు దరఖాస్తు మరియు ఇతర వివరాలు http://cfw.ap.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి మరియు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గుంటూరు, ఓల్డ్ ఇటుకలబట్టి రోడ్, అశ్విని హాస్పిటల్ వెనుకవైపు ఉన్న ప్రాంతీయ వైద్య మరియు ఆరోగ్య సేవల సంచాలకునికి దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 25.03.2026 సాయంత్రం 05:00 గంటలలోపు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.
ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ విద్య అర్హత మెరిట్ ఆధారంగా అనుభవం మరియు ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. ఓసీ అభ్యర్థులకు రూ.500/- & ఎస్సీ/ఎస్టీ/బీసీ/శారీరకంగా వికలాంగులైన అభ్యర్థులకు = రూ.300/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఆరోగ్యశాఖ అధికార వెబ్ సైట్ https://cfw.ap.nic.in/ సందర్శించవచ్చు.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

