అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా.. ఇలా చేయండి వెంటనే డబ్బులు వస్తాయి | Annadata Sukhibava 2026 All Details in Telugu
Annadatha Sukhibhava 2026 payment not received reasons solutions All Details in Telugu : ఆంధ్రప్రదేశ్ లో రైతులకు అలర్ట్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 మర్చి అన్నదాత సుఖీభవ నిధులు మూడో విడుదల చేసింది. అలాగే కేంద్రం పీఎం కిషన్ కింద 2000 విడుదల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకం కింద 4000 జమ చేసిన, ఒక్కో రైతు ఖాతాలో 6000 జమ కావడం జరిగింది. కొంతమందికి అన్నదాత సుఖీభవ నిధులు జమ కాని పరిస్థితిలో ఎక్కడ ఫిర్యాదు చేయాలి, దానికి గల కారణాలేంటి అది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ఒకేసారి 6,000 వారి ఖాతాలో జమ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు 20,000 అందిస్తామని తెలియజేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పీఎం కిషన్ పథకం కింద ప్రతి ఏటా 6000 అందిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పియం కిషన్ పథకం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడుదలలో 14000 విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అంతటా ఈనెల 13 న కేంద్ర ప్రభుత్వం 2000, ఏపీ ప్రభుత్వం 4000 మొత్తం 6000 విడుదల చేశారు. దీని ద్వారా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో 20,000 జమ పూర్తయింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు అర్హత ఉండి రాకపోతే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అధికారులు సూచిస్తున్నారు. మూడు మూడో విడుదలలో ప్రభుత్వం మొత్తం 6.85 లక్షల మంది రైతులకు 6000 చొప్పున రిలీజ్ చేశారు.
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాకపోతే ఫిర్యాదు చేసే విధానము
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గన్నవరం సభ వేదికగా అన్నదాత సుఖీభవ (₹4000) + పీఎం కిసాన్ (₹2000) నిధులను విడుదల చేశారు. మీ ఆధార్ నంబర్‌తో పేమెంట్ స్టేటస్ ఇక్కడే చెక్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ అప్ మరియు వెబ్సైట్ https://annadathasukhibhava.ap.gov.in/know-your-status డబ్బులు పడకపోతే ఏం చేయాలో కూడా పైన లింక్ లో ఉంది. వెంటనే చూడండి. అభ్యర్థులు Know Your Status అనే ఆప్షన్ ని ఎంచుకోండి అందులో ఆధార్ నెంబరు, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి, సెర్చ్ పైన ఎంటర్ చేయండి. అలాగే ఈ కేవైసీ యాక్టీవ్ లో ఉందా లేదా అనే వివరాలకు కూడా తెలుసుకోవచ్చు. మీకు డబ్బులు పడకపోతే రైతు సేవ కేంద్రంలో సంప్రదించండి. అలాగే గ్రామ వార్డు సచివాలయంలో అధికారులను అడిగి సమస్యలు తెలుసుకోవచ్చు. అభ్యర్థులు 155251 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి తమ ఫిర్యాదును చేసుకోవచ్చును. అలాగే అర్హత కలిగి ఉన్నట్లయితే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.


