AP 10th Class Exam 2026 : నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ప్రభుత్వ పరీక్షల విభాగం సూచనలు
Andhra Pradesh 10th Class Exams Start Today Important Points: ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం అనగా ఈరోజు 16 మర్చి 2026 నుంచి 01 ఏప్రిల్ 2026 తేదీ వరకు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షల ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందుకుగాను రాష్ట్రంలో 3415 పరీక్ష కేంద్రాలు ఏర్పడి ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ ఉన్నప్పుడే విద్యార్థులకు ఎగ్జామ్ హాల్లో అనుమతిస్తారు. హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. విద్యార్థులు తప్పనిసరిగా 8:45 గంటలకు గంటలకన్నా ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. అలాగే తప్పని పరిస్థితుల్లో 10 గంటల వరకు విద్యార్థులకు అనుమతి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ క్లాస్ పరీక్షలు సోమవారం ప్రారంభం కానన్నాయి. విద్యార్థులు తప్పనిసరిగా 8:45 గంటలలోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 210 పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు ముఖ్య గమనిక 10 గంటలు తర్వాత ఎవరికైనా పరీక్ష హాల్లో అనుమతి ఇవ్వబడదు. అలాగే విద్యార్థులు తమ ఒరిజినల్ హాల్ టికెట్లు తీసుకొని రావాలి. అప్పుడే పరీక్ష కేంద్రానికి అనుమతింపబడుతుంది.
ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష రాసే విద్యార్థులకు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను, పెన్సిల్, స్కేల్, సార్పునర్ & ఎరేజర్ రెండు తీసుకురావాలి. అలాగే నార్మల్ వాటర్ బాటిల్ అనుమతింపబడుతుంది. విద్యార్థులకు ఎలక్ట్రానిక్ వస్తువులు అనగా మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్ & కాలిక్యులేటర్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతింపబడదు. అలాగే విద్యార్థులకు పుస్తకాలు, కాగితపు మొక్కలు & నోట్ పుస్తకాలు తీసుకురాకూడదు. పైస్ చెప్పినటువంటి సూచనలు పాటించి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు విజయవంతంగా రాయాలని ప్రభుత్వ పరీక్ష విభాగ డైరెక్టర్ కెవి శ్రీనివాసు రెడ్డి సూచించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వివరాల కోసం కింద వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.


