10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & LGS నోటిఫికేషన్ వచ్చేసింది | AP DMHO Recruitment 2026 Notification Data Entry Officer & Last Grade Service Vacancies, Eligibility and Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & LGS నోటిఫికేషన్ వచ్చేసింది | AP DMHO Recruitment 2026 Notification Data Entry Officer & Last Grade Service Vacancies, Eligibility and Apply Online

AP DMHO Notification 2026 : ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ & మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్రప్రదేశ్ లో ఫార్మసిస్ట్ Gr-II, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, డేటా ఎంట్రీ ఆఫీసర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ & సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్దతి పై మెరిట్ మరియు రిజర్వేషన్ ల ప్రకారము నియామకములు జరుపుటకు అనుమతించిన కారణముగా దరఖాస్తులు కోరడమైనది. ఫిబ్రవరి 26 వరకు ఆఫ్ లైన్ లో వెంటనే అప్లై చేసుకోండి.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయములో ఫార్మసిస్ట్ Gr-II, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, డేటా ఎంట్రీ ఆఫీసర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ & సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ నోటిఫికేషన్ 2026ను విడుదల చేసింది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, విశాఖపట్నం వారి అధ్వర్యంలో విశాఖపట్నం లో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల యందు మొత్తం 20 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించారు. పూర్తి నోటిఫికేషన్ ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ జిల్లాల వెబ్‌సైట్ https://visakhapatnam.ap.gov.in/ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. నింపిన దరఖాస్తు ఫారమ్‌ను 18-02-2026 నుండి 26-02-2026 వరకు పని దినాలలో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు గంటలలోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయము, విశాఖపట్నం నందు దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరుతున్నాము.

పోస్టును అనుసరించి ప్రతి నెల ఫార్మసిస్ట్ Gr-II పోస్టుకు జీతం ₹23,393, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II పోస్టుకు జీతం ₹23,393/, డేటా ఎంట్రీ ఆఫీసర్ పోస్టుకు జీతం ₹18,450/-, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టుకు జీతం ₹15,000/-& సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ₹41,297/- పోస్టుకు జీతం మధ్యలో నెల జీతం ఇస్తారు.

AP DMHO నోటిఫికేషన్ 2026: ముఖ్యాంశాలు

సంస్థ :: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయము
పోస్ట్ పేరు :: ఫార్మసిస్ట్ Gr-II, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, డేటా ఎంట్రీ ఆఫీసర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ & సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్
•మొత్తం ఖాళీలు :: 20
•నోటిఫికేషన్ విడుదల తేదీ :: 18 ఫిబ్రవరి 2026
•దరఖాస్తు ప్రారంభ తేదీ :: 19 ఫిబ్రవరి 2026
•దరఖాస్తు చివరి తేదీ :: 26 ఫిబ్రవరి 2026
•ఎంపిక ప్రక్రియ :: విద్య అర్హత మెరిట్ ఆధారంగా
•ఉద్యోగ స్థానం :: విజయవాడ, AP
•అధికారిక వెబ్‌సైట్ :: https://visakhapatnam.ap.gov.in/

AP DMHOరిక్రూట్‌మెంట్ 2026 : విద్యా అర్హత

ఫార్మసిస్ట్ Gr-II :: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన SSC లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. D.Pharma// బి.ఫార్మాలో ఉత్తీర్ణత (లేదా) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు. A.P. ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థికి D.Pharma మరియు B.Pharma రెండూ ఉంటే, పైన పేర్కొన్న వాటిలో దేనిలోనైనా పొందిన గరిష్ట శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

ల్యాబ్ టెక్నీషియన్ Gr-II :: DMLT లేదా B.Sc (MLT) కలిగి ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో ఇంటర్మీడియట్ (VOC) పూర్తి చేసి ఉంటే, APPMB లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థికి DMLT మరియు B.Sc MLT రెండూ ఉంటే, పైన పేర్కొన్న వాటిలో దేనిలోనైనా పొందిన గరిష్ట శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు

డేటా ఎంట్రీ ఆఫీసర్ :: ఏదైనా విశ్వవిద్యాలయం నుండి లేదా కేంద్ర చట్టం, ప్రాంతీయ చట్టం లేదా రాష్ట్ర చట్టం ద్వారా లేదా కింద నమోదు చేయబడిన మరియు విశ్వవిద్యాలయంచే గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి. గ్రాంట్స్ కమిషన్ (లేదా) దానికి సమానం PGDCA ఉండాలి.

లాస్ట్ గ్రేడ్ సర్వీస్ :: గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ :: బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సు, సర్టిఫికెట్ కోర్సు కంప్యూటర్ ఆపరేషన్, శాశ్వత ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్, క్షయవ్యాధి ఆరోగ్య సందర్శకుల కోర్సు, సామాజిక సేవ లేదా వైద్య సామాజిక సేవలో ప్రభుత్వ గుర్తింపు పొందిన డిగ్రీ/డిప్లొమా, బహుళార్ధసాధక ఆరోగ్య కార్యకర్తకు ప్రాథమిక శిక్షణా కోర్సు ప్రభుత్వ గుర్తింపు పొందినది.

వయోపరిమితి (నోటిఫికేషన్ తేదీ నాటికి)

కనీసం వయస్సు 18 సంవత్సరాలు గరిష్టం వయస్సు 42 సంవత్సరాలు ఉడాలి. SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు 05 (ఐదు) సం||రాలు. మాజీ సైనికులకు: సాయుధ దళాలలో సేవ యొక్క పొడవుతో పాటు 03 (మూడు) సం||రాలు. వికలాంగులకు: 10 (పది) సం||రాలు. అన్ని సడలింపులతో గరిష్ట వయోపరిమితి 52 సం||రాలు వయసు సడలింపు ఉంటుంది.

•ఎంపిక ప్రక్రియ: విద్యా అర్హత మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

AP DMHO రిక్రూట్‌మెంట్ 2026 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

కావున ఆసక్తిగల http://visakhapatnam.nic.in నందు అభ్యర్ధుల http://visakhapatnam.ap.gov.in ఉంచబడిన దరఖాస్తును నింపి or ధ్రువపత్రములతోపాటు తేది 26.2. 2020 సమయం సాయంత్రం 05.00 గంటలలోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయము, విశాఖపట్నం నందు దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరుతున్నాము.

•ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 26 ఫిబ్రవరి 2026

దరఖాస్తు రుసుము :: ఆశక్తి ఉన్న అధ్యర్థులు District Medical and Health Office, Visakhapatnam పేరు మీద అప్లికేషన్ ఫీ DD రూపంలో అప్లికేషన్ కు జత చేయవలసిందిగా వినవించుకుంటున్నాము. ఓసీ/బీసీ : రూ.200/- & ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులు : రూ.100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

Important Links

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *