7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now
ముఖ్యమైన వివరాలు
• సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు లో జాబ్స్
• కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.
• 7th, ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగం.
• అప్లై చేయడానికి చివరి తేదీ 21.02.2026 సాయంత్రం 5-00 గంటల వరకు

Latest TS District Court Recruitment 2026 Latest Court Assistant & Attendant Jobs Notification 2026 Apply Now:: ఎటువంటి రాత పరీక్ష లేకుండా జిల్లా యూనిట్‌లోని యెల్లందు మరియు భద్రాచలంలోని సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పనిచేయడానికి కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ పోస్టులకు నియామకం కోసం అర్హతగల అభ్యర్థుల నుండి 21.02.2026 సాయంత్రం 5-00 గంటల వరకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
»పోస్టుల వివరాలు: కోర్ట్ అసిస్టెంట్ (1) మరియు కోర్ట్ అటెండెంట్ (2) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 03 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత ::
•కోర్ట్ అసిస్టెంట్ పోస్టుకు ఆంధ్రప్రదేశ్/తెలంగాణ, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కోర్ట్ అటెండెంట్ పోస్టుకు 7వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
»నెల జీతం :
•కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ పదవి కాలవ్యవధి (02) సంవత్సరాలు మరియు కోర్ట్ అసిస్టెంట్లకు నెలకు రూ.5,000/- మరియు కోర్ట్ అటెండెంట్లకు రూ.3,000/- వేతనం చెల్లించబడుతుంది.
»వయోపరిమితి: 01.07.2026 నాటికి అభ్యర్థులు (34) సంవత్సరాలు పూర్తి చేసి ఉండకూడదు మరియు (18) సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. SC/ST మరియు BC అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు (5) సంవత్సరాలు మరియు శారీరకంగా వికలాంగులు మరియు మాజీ సర్వీస్ మెన్లకు (10) సంవత్సరాలు. 65 సంవత్సరాల వయస్సు దాటిన ఏ పదవీ విరమణ చేసిన ఉద్యోగి అయినా కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ నియామకానికి అర్హులు కారు.
»దరఖాస్తు రుసుము :: అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా “ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, భద్రాద్రి కొత్తగూడెం” కు సమర్పించాలి మరియు దరఖాస్తు ఫారాలను ప్రత్యక్షంగా లేదా స్వయంగా స్వీకరించరు.
ముఖ్యమైన తేదీ :
•దరఖాస్తు స్వీకరణ ప్రారంభం తేదీ :: 08 ఫిబ్రవరి, 2026
•దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ : 21 ఫిబ్రవరి, 2026

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

