Lab Attendant Jobs : 12th అర్హతతో తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో కొత్త నోటిఫికేషన్ విడుదల | Telangana FSL Notification 2025 Apply Now
Telangana FSL Recruitment 2025 Latest Scientific Officer, Assistant, Lab Technician & Lab Attendant Jobs Notification Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) లో సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, లాబొరేటరీ టెక్నీషియన్లు & లాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 14 నవంబర్ 2025 నోటిఫికేషన్ జారీ చేసింది. 27 నవంబర్ 2025 ఉదయం 8 గంటల నుండి 15 డిసెంబర్ 2025 సాయంత్రం 5 గంటల వరకు TSLPRB వెబ్‌సైట్ (https://www.tgprb.in/)లో ఆన్లైన్లో అప్లైలో చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ద్వారా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) లో సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, లాబొరేటరీ టెక్నీషియన్లు & లాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగుల కోసం ఈరోజు కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో ఇంటర్మీడియట్, బీఎస్సీ, M.Sc ఆపై చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాలు నుంచి 34 మధ్యలో కలిగి ఉండాలి. నెల జీతం Rs. ₹20,280/- నుంచి ₹1,24,150/- మధ్యలో ఇస్తారు. అప్లై చేసే సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలోని కింది పోస్టులకు ప్రత్యక్ష నియామకం కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) అర్హతగల అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది, ఇది 27 నవంబర్ 2025 ఉదయం 8 గంటల నుండి 15 డిసెంబర్ 2025 సాయంత్రం 5 గంటల వరకు TSLPRB వెబ్‌సైట్ (https://www.tgprb.in/)లో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తుంది.

Telangana FSL Scientific Officer, Assistant, Lab Technician & Lab Attendant Job Recruitment 2025 Apply 60 Vacancy Overview :
సంస్థ పేరు :: TSLPRB ద్వారా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, లాబొరేటరీ టెక్నీషియన్లు & లాబొరేటరీ అటెండెంట్ పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య :: 60
వయోపరిమితి :: 34 ఏళ్లలు
విద్య అర్హత :: ఇంటర్మీడియట్, బీఎస్సీ, M.Sc
నెల జీతం :: Rs. ₹20,280/- నుంచి ₹1,24,150/-
దరఖాస్తు ప్రారంభం :: 27 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 15 డిసెంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://www.tgprb.in/

»పోస్టుల వివరాలు:
•సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, లాబొరేటరీ టెక్నీషియన్లు & లాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు తదితర ఉద్యోగాలు. మొత్తం 60 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత: పోస్ట్ అనుసరించి
•సైంటిఫిక్ ఆఫీసర్లు : గుర్తింపు పొందిన సంస్థ నుండి లేదా తత్సమాన అర్హతతో కనీసం 65% మార్కులతో ఫిజిక్స్ లేదా ఫోరెన్సిక్ సైన్స్‌తో ప్రత్యేక సబ్జెక్టుగా M.Sc. ఉత్తీర్ణులై ఉండాలి. ఫోరెన్సిక్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఫిజిక్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
•సైంటిఫిక్ అసిస్టెంట్లు : గుర్తింపు పొందిన సంస్థ నుండి భౌతికశాస్త్రం / B.Sc. ఫోరెన్సిక్ సైన్స్‌లో B.Sc. ఉత్తీర్ణులై ఉండాలి. B.Sc. ఫోరెన్సిక్ సైన్స్ చదివిన అభ్యర్థులు భౌతికశాస్త్రంలో ఒక సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
•లాబొరేటరీ టెక్నీషియన్లు : గుర్తింపు పొందిన సంస్థ నుండి భౌతికశాస్త్రం / B.Sc. ఫోరెన్సిక్ సైన్స్‌లో B.Sc. ఉత్తీర్ణులై ఉండాలి. B.Sc. ఫోరెన్సిక్ సైన్స్ చదివిన అభ్యర్థులు భౌతికశాస్త్రంలో ఒక సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
•లాబొరేటరీ అటెండెంట్ : రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన MPC లేదా Bi.PC తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.





»నెల జీతం :
పోస్ట్ అనుసరించి
•సైంటిఫిక్ ఆఫీసర్లు : Rs.45,960-1,24,150/-
•సైంటిఫిక్ అసిస్టెంట్లు : Rs.42,300-1,15,270/-
•లాబొరేటరీ టెక్నీషియన్లు : Rs.24,280-72,850/-
•లాబొరేటరీ అటెండెంట్ : Rs.20,280-62,110/- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: ఒక అభ్యర్థికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 2025 జూలై 1 నాటికి 34 సంవత్సరాలు నిండకూడదు.
»దరఖాస్తు రుసుము: అభ్యర్థులు దరఖాస్తు నమోదు, దరఖాస్తు ప్రాసెసింగ్, పరీక్షల నిర్వహణ, పోర్టల్ నిర్వహణ మొదలైన వాటికి సంబంధిత పోస్టు/ల కోసం ఈ క్రింది రుసుములను చెల్లించాలి. వివిధ సబ్జెక్టులలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వేర్వేరు రాత పరీక్షలు నిర్వహించబడుతున్నందున అటువంటి ప్రతి సబ్జెక్టుకు విడిగా రుసుము చెల్లించాలి.

»ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నియామక ప్రక్రియ యొక్క నిబంధనలు మరియు షరతులకు సంబంధించి వారి అర్హత గురించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే, నిర్దేశించిన ప్రొఫార్మాలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, ఇది నవంబర్ 27, 2025 ఉదయం 8 గంటల నుండి డిసెంబర్ 15, 2025 సాయంత్రం 5 గంటల వరకు TSLPRB వెబ్‌సైట్ (www.tgprb.in)లో అందుబాటులో ఉంటుంది. అర్హత ప్రమాణాలు, సిలబస్, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, ఖాళీల పంపిణీ, ఎంపిక విధానం మరియు అభ్యర్థులకు సూచనలు మొదలైన వాటికి సంబంధించిన వివరణాత్మక సమాచారం www.tgprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడిన నోటిఫికేషన్‌లో ఇవ్వబడింది.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 27 నవంబర్ 2025
•ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ మరియు ఫీజు సమర్పణకు చివరి తేదీ :: 15 డిసెంబర్ 2025 (23:59:59 గంటలు)

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

