Junior Assistant Recruitment 2025 : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – దరఖాస్తు తేదీలు, నోటిఫికేషన్ వివరాలివే..
IITISM Junior Assistant Recruitment 2025 Apply Now : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా సొంత రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ – 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 26, 2025 లోపు (23:59 HRS వరకు) ఆన్‌లైన్‌లో దరఖాస్తును సమర్పించాలి.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) న్యూస్ చెప్పింది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇన్స్టిట్యూట్ మరియు దాని కార్యకలాపాలకు సంబంధించిన ఇతర వివరాలను దాని వెబ్‌సైట్ www.iitism.ac.in నుండి పొందవచ్చు.

విద్యా మరియు ఇతర అర్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 55% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. వివిధ రకాల కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్లు, M.S వర్డ్, ఎక్సెల్, పవర్-పాయింట్ లేదా తత్సమానమైన వాటిని ఉపయోగించడంలో నైపుణ్యం తప్పనిసరి. కంప్యూటర్లలో ఇంగ్లీషులో నిమిషాలకు 25 పదాలు లేదా హిందీలో నిమిషాలకు 20 పదాలు టైపింగ్ వేగం కలిగి ఉండాలి. IIT (ISM) Ho మెడికల్ బోర్డ్ ద్వారా టైప్ చేయలేని శారీరక వికలాంగులకు రిక్రూట్‌మెంట్ నియమాలు వర్తించవు. మొత్తం 19 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఆన్లైన్ www.iitism.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 26, 2025 తేదీలోపు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత గల అభ్యర్థులు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులవుతారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. దరఖాస్తుదారుడి వయసు 26.10.2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి. ఈ వివరాలను IITISM జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ లో చూడొచ్చు.
రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తదితరాల ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25500-రూ.81100/- మధ్య చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
అప్లికేషన్ ప్రాసెస్…. అర్హులైన అభ్యర్థులు ముందుగా
https://nfr.iitism.ac.in/index.php/recruitment/User లాగిన్ లింక్‌లో అందుబాటులో ఉన్న నాన్-ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ మాడ్యూల్‌ని ఉపయోగించి అక్టోబర్ 26, 2025 లోపు (23:59 HRS వరకు) ఆన్‌లైన్‌లో దరఖాస్తును సమర్పించాలి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా కనిపిస్తాయి. నియామక రుసుము రూ. 500/- ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్ https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm లో అందుబాటులో ఉన్న SBI కలెక్ట్ లింక్ ద్వారా చెల్లించాలి.

🔥Notification Pdf Click Here
🔥Apply Link Click Here
🔥Official Website Click Here