Ayah Notification 2025 : ఏపీలో శిశు సంక్షేమ శాఖ లో భారీ నోటిఫికేషన్ అర్హతలు.. ఆఖరి తేదీ
AP Women & Child Welfare & Empowerment Officer Social worker, Ayahs, Cook, Night Watchman & Part time Teachers job recruitment apply offline now : కేవలం 7th, టెన్త్ & ఎన్ని డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో ఆయా, సోషల్ వర్కర్, కుక్, హేల్పెర్ కమ్ నైట్ వాచ్ మెన్, మ్యూజిక్ టీచర్ & యోగ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.


ఆంధ్రప్రదేశ్ లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశుగృహ నందు ఖాళీగా వున్న కాంట్రాక్టు పద్ధతిలో 1) సోషల్ వర్కర్ కమ్ ఎర్లీచైల్డ్ హుడ్ కం ఎడ్యుకేట్ ర్(1) 2) ఆయా-2 (EWS-1, OC(W)), పత్తికొండ బాలసధనము నందు ఖాళీగా వున్న అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 1) కుక్ -1(SC(W)) 2) హేల్పెర్ కమ్ నైట్ వాచ్ మెన్-1 (SC(W)), పార్ట్ టైం పద్ధతిలో 3) ఎడ్యుకేట్ ర్ -1 (OC (W)) 4)ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్-1(SC(W)) 5) ఇన్స్ట్రక్టర్ కమ్ యోగ టీచర్-1(OC(W)) మరియు బాలసధనము పెద్దపాడు నందు ఖాళీగా ఉన్న ఇన్స్ట్రక్టర్ కమ్ యోగ టీచర్-1 (SC(W)) (పార్ట్ టైం) నియామకాల, కొరకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చ. వయస్సు 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉడాలి. ఎస్.సి., ఎస్.టి., బి.సి., వికలాంగుల అభ్యర్ధులకు ఐదేళ్ళు వయస్సు సడలింపు వుంటుంది. విద్యార్హతలు, పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ http://kurnool.ap.gov.in// ను మరియు కార్యాలయము నోటీస్ బోర్డు నందు పరిశీలించగలరు.



అభ్యర్ధులు ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, రూము.నెం:122, కర్నూలు (కలెక్టరేట్) వారి కార్యాలయములో ధరఖాస్తు సమర్పిమ్సావలయును. అభ్యర్థి తన సొంత చిరునామా గల రెండు కవర్లకు తగిన స్టాంపులు అతికించి ధరఖాస్తుకు జతపరచవలెను. అభ్యర్థి యొక్క వివరములు నిర్దిష్ట ఫార్మెట్ లో వ్రాసి ఫోటో అతికించవలెను.
జతపరచవలసిన ధ్రువపత్రములు: పోస్టు కు అవసరమగు అన్ని ధ్రువపత్రముల జిరాక్స్ కాపీలను (గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి) జతపరిచి, కార్యాలయపు పనిదినములలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయము తమ అప్లికేషన్ సమర్పించుకోవాలి.
అప్లై చేసుకోవలసిన చిరునామా : అభ్యర్థులు ఈ నెల 09.09.2025 నుండి 17.09.2025 లోగా (పని దినములలో మాత్రమే) ఉదయం 10.30 నుండి సాయంత్రము 5.00 వరకు కలెక్టరేట్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖా కార్యాలయం, రూమ్.నెం.122, కర్నూలు నందు దరఖాస్తులు సమర్పించవలెను.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here