Warden Jobs : 10వ తరగతి అర్హతతో ఏకలవ్య గురుకుల విద్యాలయాలలో అటెండెంట్ & హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్
Ekalavya Gurukul Vidyalayas Hostel Warden & Attendant Notification 2025 : తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ లో కొత్త నోటిఫికేషన్ విడుదల
గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ, జిల్లాలోని ఈ దిగువ సూచించిన బోధనేతర సిబ్బంది ఆవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహించుటకు ఆర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఆసక్తిగల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులు/ బయోడేటాతో పాటు అర్హత ధృవీకరణ ప్రతులు (జిరాక్స్ ప్రతులు) తేది. 06.09.2025 నుండి 15.09.2025 సాయంత్రం 04.00 గంటలలోపు ప్రాంతీయ సమన్యయ అధికారి కార్యాలయం మహబూబాబాద్ నందు సమర్పించగలరు.

పోస్టు పేరు :
•హాస్టల్ వార్డెన్ (పురుష) = 01
•హాస్టల్ వార్డెన్ 02 (మహిళ) = 02
•అకౌంటెంట్ = 01
•కౌన్సిలర్ = 04
•కేటరింగ్ అసిస్టెంట్ = 01
•ఎలక్ట్రిషియన్ కమ్ ఫ్లంబర్ = 03
•ల్యాబ్ అటెండెంట్ = 01
•మెస్ హెల్పర్ = 02
విద్యా అర్హత :
హాస్టల్ వార్డెన్ (పురుష) : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (3 లేదా 4) సంవత్సరాలు.
హాస్టల్ వార్డెన్ (మహిళ) : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (3 లేదా 4) సంవత్సరాలు.
అకౌంటెంట్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుండి వాణిజ్య డిగ్రీ (కామర్స్).
కౌన్సిలర్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుండి సైకాలజీ/ క్లినికల్ సైకాలజిలో మాస్టర్స్ డిగ్రీ.
కేటరింగ్ అసిస్టెంట్ : భారత ప్రభుత్వం/ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తించిన సంస్థ నుండి కేటరింగ్లో 03 సంవత్సరాల డిగ్రీ కోర్సు లేదా తత్సమానం లేదా రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్లోని డిఫెన్స్ సర్వీసెస్లో కనీసం 10 సంవత్సరాల సేనతో కేటరింగ్లో ట్రేడ్ ప్రావీణ్యత సర్టిఫికేట్ (మాజీ సైనికులకు మాత్రమే).
ఎలక్ట్రిషియన్ కమ్ ఫ్లంబర్ : గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణత. ఐ.టి.ఐ సర్టిఫికేట్ లేదా పాలిటెక్నిక్ సర్టిఫికేట్ లేదా ఎలక్ట్రిషియన్ లేదా వైర్మెన్ ట్రేడ్లో ఉన్నత డిగ్రీ
ల్యాబ్ అటెండెంట్ : గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుండి ల్యాబరేటరీ బెక్నిక్ సర్టిఫికేట్/డిప్లొమాతో పాటు 10వ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటి నుండి సైన్స్ స్ట్రీమ్తో 12వ తరగతి.
మెస్ హెల్పర్ : గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
వయస్సు : అభ్యర్థి వయసు పద్యం సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి.
దరఖాస్తు రుసుము : ఫీజు లేదు.
దరఖాస్తు విధానం : ఆసక్తిగల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులు/ బయోడేటాతో పాటు అర్హత ధృవీకరణ ప్రతులు (జిరాక్స్ ప్రతులు) తేది. 06.09.2025 నుండి 15.09.2025 సాయంత్రం 04.00 గంటలలోపు ప్రాంతీయ సమన్యయ అధికారి కార్యాలయం మహబూబాబాద్ నందు సమర్పించగలరు.

🛑Notification Pdf Click Here