Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు.. పంజాబ్ & సింధ్ బ్యాంక్ లో స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) జాబ్స్ నోటిఫికేషన్ | Punjab and Sind Bank LBO Recruitment 2025 Notification Out Apply for 750 Vacancies in Telugu
Punjab and Sind Bank LBO Recruitment 2025 all job notification detail in Telugu : తెలుగు భాష వస్తే చాలు.. పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ లో స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) లో 750 ఉద్యోగుల కోసం రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ Local Bank Officers in JMGS I పై పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చేసుకునే ముందు, అభ్యర్థుల నిర్దేశించిన అర్హత ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోవాలని సూచించారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలోని స్థానిక భాషలో (చదవడం, రాయడం, మాట్లాడటం మరియు అర్థం చేసుకోవడం) ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో రూ. 62,480/- నుండి రూ.85,920/- మధ్యలో నెలకు జీతం ఇస్తారు. కేవలం Any డిగ్రీ అర్హతతో అప్లై చేసుకుని పెర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. ఇది వెబ్‌సైట్ https://punjabandsindbank.co.in/content/recruitment వెబ్‌సైట్‌ల లో అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 20.08.2025 ఉదయం 10.00 గంటల నుండి ఆన్‌లైన్ దరఖాస్తును స్వీకరించడానికి/సమర్పించడానికి చివరి తేదీ 04.09.2025 రాత్రి 11.59 గంటలకు లోపు అప్లై చేయాలి.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 20 ఆగష్టు 2025
*దరఖాస్తు చివరి తేదీ = 04 సెప్టెంబర్ 2025
పంజాబ్ & సింధ్ బ్యాంక్ (భారత ప్రభుత్వ సంస్థ) లో JMGS I లో స్థానిక బ్యాంక్ అధికారుల లాటరల్ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థి క్రింద పేర్కొన్న విధంగా పోస్టుల అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు Punjab & Sind Bank వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పంజాబ్ & సింధ్ బ్యాంక్ (భారత ప్రభుత్వ సంస్థ) లో LBO నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: పంజాబ్ & సింధ్ బ్యాంక్ (భారత ప్రభుత్వ సంస్థ) లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: Local Bank Officers in JMGS I పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 20 to 30 Yrs
మొత్తం పోస్ట్ :: 750
అర్హత :: Any డిగ్రీ
నెల జీతం :: రూ. 62,480/- నుండి రూ.85,920/-
దరఖాస్తు ప్రారంభం :: ఆగష్టు 20, 2025
దరఖాస్తుచివరి తేదీ :: సెప్టెంబర్ 04 , 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ ::https://punjabandsindbank.co.in/content/recruitment
»పోస్టుల వివరాలు: Local Bank Officers in JMGS I – 750 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత:
అర్హత పని అనుభవం కోసం కట్-ఆఫ్ తేదీ 04.09.2025) భారత ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత. అభ్యర్థి అతను/ఆమె నమోదు చేసుకున్న రోజున అతను/ఆమె గ్రాడ్యుయేట్ అని చెల్లుబాటు అయ్యే మార్క్-షీట్ / డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి మరియు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేటప్పుడు గ్రాడ్యుయేషన్‌లో పొందిన మార్కుల శాతాన్ని సూచించాలి.

»వయసు: వయస్సు (కట్-ఆఫ్ తేదీ 01.08.2025 నాటికి): కనిష్ట:20 to గరిష్టం:30. వయస్సు కలిగిన అభ్యర్థులు. అభ్యర్థి 02.08.1995 కంటే ముందు మరియు 01.08.2005 కంటే తరువాత జన్మించి ఉండాలి. (రెండు తేదీలు కలుపుకొని).

*SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు
*OBC అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
»వేతనం: రూ. 62,480/- నుండి రూ.85,920/- నెల జీతం ఇస్తారు.

»దరఖాస్తు రుసుము:
•జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యూఎస్ = దరఖాస్తు రుసుము మరియు సమాచార ఛార్జీలు రూ. 850/-
• SC/ST/PwBD/మహిళలు/మాజీ సైనికులకు రూ.100/-

»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు రెప్కో బ్యాంక్ వెబ్‌సైట్ https://punjabandsindbank.co.in/content/recruitment కు వెళ్లి “APPLY ONLINE” ఎంపికపై క్లిక్ చేయాలి, అది కొత్త స్క్రీన్‌ను తెరుస్తుంది. దరఖాస్తును నమోదు చేసుకోవడానికి, “క్రొత్త రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి” అనే ట్యాబ్‌ను ఎంచుకుని, పేరు, సంప్రదింపు వివరాలు మరియు ఇమెయిల్-ఐడిని నమోదు చేయండి.
ముఖ్యమైన తేదీలు:
• ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ : 20.08.2025
• దరఖాస్తు ఫారమ్ యొక్క ఆన్‌లైన్ సమర్పణకు చివరి తేదీ : 04.09.2025 రాత్రి 11:59 వరకు

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here