CBSE 10th Class, 12th Class Results 2025 | CBSE ఫలితాలు విడుదల విద్యార్థులకు ముఖ్యమైన అప్డేడేట్ ఫలితాలకు డేట్ ఫిక్స్..!
CBSE 10th Class, 12th Class Results 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహించే 10వ తరగతి (Class 10) మరియు పన్నెండవ తరగతి (Class 12) పరీక్షల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు వేచి చూస్తున్నారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 4 వరకు కొనసాగాయి. ఇప్పుడు విద్యార్థులు మరియు తల్లిదండ్రుల్లో ఫలితాలపై ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఎదురుచూస్తున్నారు.

CBSE 10th Class, 12th Class ఫలితాల విడుదలపై అంచనాలు: గత సంవత్సరాల ఫలితాల విడుదల తేదీలను పరిశీలిస్తే, 2023లో మే 12న, 2024లో మే 13న ఫలితాలు విడుదలయ్యాయి. అందువల్ల ఈ సంవత్సరం 2025 మే రెండవ వారంలో, అంటే మే 12 నుంచి 15 మధ్యలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అధికారికంగా తేదీ ప్రకటించబడిన వెంటనే విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలను ఎక్కడ చూడొచ్చు?
CBSE ఫలితాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ఈ క్రింది అధికారిక వెబ్‌సైట్‌లలో ఫలితాలను చూసుకోవచ్చు:
• https://www.cbse.gov.in/
• https://results.cbse.nic.in/
• https://results.cbse.nic.in/
• https://results.digilocker.gov.in/
• https://web.umang.gov.in/landing
• https://results.eenadu.net/
ఈ వెబ్‌సైట్‌లలో ఫలితాల విడుదల అనంతరం పైన లింకుల మీద క్లిక్ చేసి వెంటనే తమ హాల్ టికెట్ నెంబర్ రిజల్ట్స్ ను తెలుసుకోవచ్చు.
ఫలితాలు ఎలా చెక్ చేయాలి? విద్యార్థులు తాము సాధించిన మార్కులను తెలుసుకోవడం చాలా సులభం. క్రింది స్టెప్స్ పాటించండి:
• ముందుగా CBSE అధికారిక వెబ్‌సైట్ https://results.cbse.nic.in/ ని ఓపెన్ చేయండి.
• “Class 10 Results 2025” లేదా “Class 12 Results 2025” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
• అక్కడ మీ రోల్ నంబర్, పుట్టిన తేదీ మరియు సెక్యూరిటీ కోడ్ (క్యాప్చా) ఎంటర్ చేయాలి.
• అందిన వివరాలతో “Submit” బటన్‌పై క్లిక్ చేయండి.
• మీ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. వాటిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు.

CBSE 10వ తరగతి, 12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు మే నెల రెండవ వారంలో మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది. అధికారిక సమాచారం కోసం ఎప్పటికప్పుడు CBSE వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండండి. ఫలితాల రోజు ఇంటర్నెట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశమున్నందున, వెబ్‌సైట్ ఓపెన్ కాకపోతే కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.