TS SSC Results : 30న 10th ఫలితాలు విడుదల డైరెక్ట్ లింక్ ఇదే
10వ ఫలితాల తేదీ 2025 TS : తెలంగాణ రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు ఇది కీలకమైన సమయం. ఎస్సెస్సీ (SSC) పబ్లిక్ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం, 2025, ఏప్రిల్ 30న మధ్యాహ్నం 1 గంటకు SSC ఫలితాలను విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.

TS SSC ఫలితాలు చూడడానికి అధికారిక లింకులు : విద్యార్థులు తమ ఫలితాలను నేరుగా ఈ వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. https://www.bse.telangana.gov.in/Results.aspx లేదా https://bse.telangana.gov.in/ వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాలు BSE తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లో చూడవచ్చు.
ఈ ఏడాది తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రత్యేకతలు : ఈసారి ఫలితాల ప్రదర్శన విధానంలో కొన్ని కీలక మార్పులు చేశారు విద్యార్థుల మార్కుల మెమోలో ప్రతి సబ్జెక్టు కోసం ప్రత్యేక గ్రేడ్ లను చూపించనున్నారు. ఫైనల్ గ్రేడ్ లను నిర్ణయించడంలో రాత పరీక్షలతో పాటు ఇంటర్నల్ అసెస్మెంట్లు, 4 కో-కరిక్యులర్ యాక్టివిటీస్ మార్కులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం మార్కుల స్థానంలో గ్రేడ్ పాయింట్స్ ఆధారంగా ప్రతీ సబ్జెక్టు వివరాలు పొందుపరచనున్నారు.
TS SSC పరీక్షలు – హాజరు వివరాలు
2025 మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలలో పాల్గొన్నారు. మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఫలితాలను ఎలా చెక్ చేయాలి?
• అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://www.bse.telangana.gov.in/Results.aspx లేదా https://bse.telangana.gov.in/
• “SSC Results 2025” అనే లింక్‌పై క్లిక్ చేయండి
• విద్యార్థి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి
• “Submit” క్లిక్ చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై చూపించబడతాయి
• డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
🔥Homeguard Jobs : 12th అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో హోంగార్డ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల