Ration Card : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే మీ కార్డు పనిచేయదు
Ration card : భారత ప్రభుత్వం రేషన్ కార్డు హోల్డర్లకు ఒక ముఖ్యమైన సూచనను జారీ చేసింది 2025 ఏప్రిల్ 30 నాటికి e-KYC ప్రక్రియను పూర్తిచేయాలి. ఈ ప్రక్రియ ద్వారా, అనర్హులైన లేదా నకిలీ లబ్ధిదారులను తొలగించి, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ఆహార ధాన్యాలు అందించడమే లక్ష్యం. ఈ కేవైసీ కాకపోతే రేషన్ కార్డు నిలిపివేయడం జరుగుతుంది.
e-KYC అనేది “ఇలక్ట్రానిక్-నాలెడ్జ్ ఆఫ్ కస్టమర్” అనే అర్థం. ఇది ఆధార్ ఆధారిత ధృవీకరణ ప్రక్రియ. ప్రతి కుటుంబ సభ్యుడి ఆధార్ కార్డు వివరాలను, రేషన్ కార్డు సమాచారంతో అనుసంధానించి, వారి నిజమైన గుర్తింపును ధృవీకరించడమే లక్ష్యం.
e-KYC ఎలా చేయాలి?
• మీ రాష్ట్ర PDS అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
• ‘e-KYC’ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
• రేషన్ కార్డు నంబర్ & ఆధార్ నంబర్ నమోదు చేయండి.
• మీ మొబైల్‌కు వచ్చిన OTPను నమోదు చేయండి.
• ధృవీకరణ పూర్తయిన తర్వాత, e-KYC ప్రక్రియ పూర్తవుతుంది.
ఆఫ్‌లైన్ విధానం:
• సమీప రేషన్ దుకాణం / మీ సేవా కేంద్రం / ఆధార్ కేంద్రం సందర్శించండి.
• ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డును సమర్పించండి.
• బయోమెట్రిక్ వెరిఫికేషన్ (వేలిముద్ర / ఐరిస్ స్కాన్) చేయించాలి.
రేషన్ కి e-KYC ప్రక్రియ 2025 ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేయకపోతే, మీరు ప్రభుత్వ రేషన్ సేవలు మరియు ఇతర పథకాల నుండి తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుంది. కనుక ముందస్తుగా చర్యలు తీసుకోండి.