Power Cut : విద్యుత్ సరఫరాలో అంతరాయాలు
Power Cut : దామరచర్ల సబ్ స్టేషన్లో మెయింటెనెన్స్ పనులు మరియు కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ సంబంధిత పనుల కారణంగా, రేపు శుక్రవారం ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడనుందని మండల విద్యుత్ అధికారి అబ్దుల్లా హబీబ్ తెలిపారు. ఈ అంతరాయం దామరచర్ల టౌన్ ఫీడర్, నర్సాపురం ఫీడర్, బొత్తలపాలెం ఫీడర్, వాచ్య తండ జిపి ఫీడర్, వాడపల్లి ఫీడర్, దామరచర్ల ఏజీయల్ ఫీడర్, దామరచర్ల లిఫ్ట్ ఫీడర్, మరియు టీవీ గూడెం ఏజ్ ఎల్ ఫీడర్ల కింద ఉన్న గ్రామాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, ఈ సమయంలో విద్యుత్ వినియోగదారులందరూ సహకరించాలని అధికారి కోరారు.