AP 10th Class Results 2025 | 10th Class Social Exam Postponed 2025 | Paper Correction Update
AP 10th Class Results | Paper Correction Update : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి ప్రకటించిన ప్రకారం, మొత్తం 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేశారు. సహాయ ఎగ్జామినర్లు ప్రతి రోజు 40 జవాబు పత్రాలను దిద్దాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు 6,36,241 మంది విద్యార్థులకు గాను 627,673(98.65%) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

మూల్యాంకనం చేసిన పత్రాలను పునఃపరిశీలనలో మార్కుల తేడాలు ఉంటే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఎగ్జామినేషన్ సెంటర్లలో సెల్ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రతి మూల్యాంకన కేంద్రంలో అధికారులను నియమించి, కఠినంగా పర్యవేక్షణ చేయనున్నారు.
పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్షను ఏప్రిల్ 1న నిర్వహించనున్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు ప్రకటన ప్రకారం, ప్రభుత్వం మార్చి 31న రంజాన్ పండుగ సెలవు ప్రకటించడంతో ఈ మార్పు జరిగింది.
మార్చి 31న నిల్వ కేంద్రాలకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. పరీక్ష తేదీల గురించి హెచ్‌ఎంలు, ఇన్విజిలేటర్లు, పోలీస్ శాఖ, ట్రెజరీ సిబ్బంది, పోస్టల్ శాఖ వంటి విభాగాలకు సమాచారం అందించారు. అన్ని విద్యార్థులు మార్పును గుర్తుంచుకొని అనుసరించాలి. చిత్తూరు జిల్లాలో జరిగిన జీవశాస్త్రం పరీక్షలో ఒక విద్యార్థి చూచిరాతకు పాల్పడగా, అతడిని డిబార్ చేశారు. సంబంధిత ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ పరీక్షల శాఖ అన్ని పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా నిఘా ఉంచనుంది.

పదో తరగతి విద్యార్థులు పరీక్షల మార్పులు, మూల్యాంకన ప్రణాళికలను తెలుసుకొని సన్నద్ధం కావాలి. ప్రభుత్వ పరీక్షల విభాగం మార్గదర్శకాలను పాటిస్తూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి.