Free Home Scheme 2024 : పేదలకు పెద్ద శుభవార్త.. గ్రామంలో 3 సెంట్లు స్థలం ఎలా అప్లై చేసుకోవాలో చూడండి
Free Home Site Scheme Full Details in Telugu : మిత్రులందరికీ నమస్కారం, త్వరలోనే పేదలందరికీ ఇల్లు. గుడ్ న్యూస్ చెప్పిన బాబు. ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో తన మానస పుత్రికగా చెప్పుకున్న నవరత్నాల పైన ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గత వైసిపి ప్రభుత్వం పెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పేరును కొత్త ప్రభుత్వం తొలగించింది. పూర్తయిన పేదల ఇళ్లపై జగన్ బొమ్మతో ఉన్న లోగోలు అతికించడం నిర్దిష్ట రంగులను కూడా తక్షణమే నిలిపివేయాలని అన్ని జిల్లాల హౌసింగ్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
హౌసింగ్ కార్పొరేషన్ తో పాటు కార్పొరేషన్ ద్వారా జారీ చేసే లబ్ధిదారుల కార్డులు, పాస్ పుస్తకాలు, సర్టిఫికెట్లు పై కూడా జగన్ బొమ్మలు వైసీపీ జెండారంగు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రాంతాలలో ఉండే అభ్యర్థులకు 3 సెంట్లు భూమి ఇస్తామని, పట్టణ ప్రాంతాలలో నివసించే అభ్యర్థులకు రెండు సెంట్లు భూమి ఇస్తామని తెలియజేశారు.. ఈ పథకం కింద కొత్తగా ఎంపిక చేసిన లబ్యదారులకు ఇంటి నిర్మాణం కోసం నాలుగు లక్షల సహాయం అయితే చేయనున్నది. వీటిలో కేంద్రం వాటా 2.5 లక్ష కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 1.5 లక్ష ఇవ్వడం జరుగుతుంది.
నిరుపేదలకు ఎంత స్థలం ఇస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం గ్రామ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు 3 సెంట్ల స్థలం ఇస్తారు అలాగే పట్టణ ప్రాంతాలను అభ్యర్థులకు 2 సెంట్ల స్థలం భూమి ఇస్తారని తెలియజేస్తున్నారు.
ఈ స్కీముకి ఎవరు అర్హులు :-
ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు లేని నిరుపేద అందరు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
•అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి.
•అభ్యర్థి తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి.
•రేషన్ కార్డులో ఉన్నటువంటి అభ్యర్థుల పేరు మీద ఇంతకుముందు ఇళ్ల స్థలం తీసుకోకుండా ఉండాలి.
•ఇంతకుముందు ప్రభుత్వం ద్వారా ఇల్లు స్థలం పొంది ఉండరాదు. పొంది ఉన్నట్లయితే వాళ్ళు అనర్హులు.
ఈ స్కీమ్స్ కి కావలసిన డాక్యుమెంట్ వివరాలు
• ఆధార్ కార్డు
• కుల ధ్రువీకరణ పత్రం
• రేషన్ కార్డ్
• ఆదాయ ధ్రువీకరణ పత్రం
• బ్యాంక్ అకౌంట్
• తాజాగా తీసుకున్న ఫస్ట్ సైజ్ ఫోటో
• మొబైల్ నెంబర్
ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు కూడా ఈ ఇంటి స్థలం దొరుకుతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం గారు తెలియజేయడం జరిగింది.
ఎలా అప్లై చేసుకోవాలి :-
ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలా ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పటివరకు మనకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ అనేది యాక్టివ్ అయితే కాలేదు అయితే వీఆర్వో వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇల్లు స్థలమైతే మీకు ఇవ్వడం జరుగుతుంది.
ఫ్రీ హౌస్ పొందాలని అభ్యర్థులు కింద మరిన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. Click Here