తల్లికి వందనం పథకం కొత్త అర్హత సమాచారం | Talliki Vandanam scheme in Telugu
Talliki Vandanam scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని తెలియజేయడం జరిగింది. పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరమవ్వకుండా ఉండాలని ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తుంది, డ్రాపౌట్ రేటును గణనీయంగా తగ్గిస్తుంది.
తల్లికి వందనం పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్ 2nd ఇయర్ ) వరకు చదువుతున్న తల్లులకు ప్రభుత్వం నేరుగా రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. BPL (Below Poverty Line) కుటుంబాలకు చెందిన వారై ఉండాలి. దీనికిగాను రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.
Talliki Vandanam scheme required documents
- నివాస ధృవీకరణ సర్టిఫికెట్
- ఆధార్ కార్డ్
- రేషన్ కార్డు
- కుటుంబ ఇన్కమ్ సర్టిఫికేట్
- మొబైల్ నంబర్ (ఆధార్ కార్డు లింక్ లింక్ ఉండాలి)
- బ్యాంక్ పాస్ బుక్
- కొత్త గా పాస్పోర్ట్ సైజు ఫోటో
విద్యార్థుల హాజరు తప్పనిసరిగా 75% మించి ఉండవలెను. ఆధార కార్డు ధ్రువీకరణ ద్వారా ఈ పథకానికి సంబంధించి ధ్రువీకరణ ఉంటుంది కావున తల్లులకు/ సంరక్షకులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను. పూర్తి విధి విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది. ప్రస్తుతానికి తల్లికి వందనం పథకం సంబంధించి ఆధార ధ్రువీకరణకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది.
🔴GO Letter No Click Here