Anganwadi Teacher, Helper Jobs Requirement 2021 | Latest Government Jobs
>అంగన్వాడీల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తాడేపల్లిగూడెం రూరల్ : మండలంలోని 8 గ్రామాల్లోని అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఐసీడీఎస్ సీడీపీవో స్వరాజ్యలక్ష్మి గురువారం తెలిపారు.
>జగ్గన్నపేట జనరల్, గొల్లగూడెం ఎస్సీలకు కార్యకర్త పోస్టులు, పట్టెంపాలెం జనరల్, మాధవరం ఎస్సీ, కుంచనపల్లి జనరల్, గొల్లగూడెం బీసీ (డీ), రామన్నగూడెం జనరల్, మారంపల్లి ఎస్సీలకు సహా యకురాలి పోస్టులు రిజర్వు అయ్యాయన్నారు.
>స్థానికులై , పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 2021 జులై 1 నాటికి 21 నుంచి 35 ఏళ్ళ లోపు వయసు వారు అర్హులుగా పేర్కొన్నారు.
>ధృవీకరణ పత్రాలతో ఈ నెల 16 సాయంత్రం 5 గంటల లోపు ఐసీడీఎస్, నల్లజర్ల ప్రాజెక్టుకు అందేలా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
>వికలాంగులైతే తమ పని తాము చేసుకునే వారు దరఖాస్తు చేసుకోవ చ్చన్నారు. ఉంగుటూరు మండలంలో 2 పోస్టులకు
>ఉంగుటూరు : ఉంగుటూరు 181 నంబరు కేంద్రా నికి, కైకరం 243 నంబరు కేంద్రానికి అంగన్ వాడి సహయకురాలి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్టు ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి తెలిపారు.
>ఈ నెల 15 లోపు దరఖాస్తులను నల్లజర్ల ఐసీడీఎస్ ఆఫీసుకు అందచేయాలని సూచించారు.
➡️అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు
1. అభ్యర్థిని తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి.
2. తేదీ: 01.07.2021 నాటికి అభ్యర్థిని కనీస వయస్సు 21 సం, లు నిండి 35 సం,లు దాటి ఉండరాదు.
3. జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.
4. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి.
5. అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీ లో నివసిస్తూ ఉండాలి.
6. ఎస్.సి., ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు 01.07.2021 నాటికి 21 – 35 సం. వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే.
7. ఎస్.పి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థినులు అర్హులు.
8. ఎస్.సి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యాబిటీషన్ కి చెందిన అభ్యర్థినులు అర్హులు.
9. ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి కు చెందిన అభ్యర్థినులు అర్హులు.
10. ఎస్.టి. కి కేటాయించబడిన అంగన్ వాడి కేంద్రాలకు అది హ్యాబిటీషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు.
11. మున్సిపాలిటీ పరిధి లో అప్లై చేసుకునేవారు. అదే వార్డ్ లో నివాసము కలిగిన అభ్యర్థినులు అర్హులు.
➡️ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు
I. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు .
II. అంధత్వం ఉన్నప్పటికి (ESCORT) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.
III. కాళ్ళు, చేతులకు సంబందించిన అంగ వైకల్యం కలిగినప్పటికి పూర్వ ప్రాధమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు .
➡️జతపరచవలసిన ధృవ పత్రాలు (Scanned Copies)
1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.
2. కుల దృవీకరణ పత్రం.
3. విద్యార్హత దృవీకరణ పత్రం (పదవ తరగతి మార్కుల జాబితా).
4. నివాసస్థల దృవీకరణ పత్రం.
5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి దృవీకరణ పత్రం.
6. వితంతువు అయితే భర్త దృవీకరణ పత్రం.
7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
ఈనెల 29 సెప్టెంబర్ 2021 నుంచి 23 అక్టోబర్ 9, 2021 వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు.
Those who want to download this Notification
Click on the link given below
========================
Important Links:
✅️Newspaper Link Click Here