APSRTC Job Recruitment Telugu
>కారుణ్య నియామకాలు 30 లోగా పూర్తి.
>ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు
>ఎంపిక ప్రక్రియకు విధివిధానాలు జారీ
>బాధిత కుటుంబాల్లో అర్హులు లేకపోతే ఎక్స్ప్రెషియా కారుణ్య నియామకాల ప్రక్రియను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులిచ్చారు. కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబసభ్యులకు ఉద్యోగాలిచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆర్టీసీ సంస్థ వేగంగా చర్యలు తీసుకుంటోంది.
>ఇందులో భాగంగా విధి విధానాలు, షెడ్యూల్ను నిర్దేశిస్తూ ఎండీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
>నియామక ప్రక్రియ ఇలా ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు తమ పరిధిలోని అర్హుల దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 20 లోగా పూర్తి చేస్తారు.
>జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగుల ఎంపికను జోనల్ సెలక్షన్ కమిటీలు ఈ నెల 23 లోగా పూర్తి చేస్తాయి.
>కండక్టర్ , డ్రైవర్ , శ్రామిక్ పోస్టులకు ఎంపికను రీజనల్ కమిటీలు ఈ నెల 25 లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
>ఎంపికైన వారికి ఈ నెల 27 లోగా వైద్య పరీక్షలు చేస్తారు.
>జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు .. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ ఉద్యోగాలకు రీజనల్ మేనేజర్లు ఈనెల 30 లోగా నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. అనంతరం శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
>కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అర్హులైనవారు లేకపోతే ఎక్స్ప్రెషియా అందిస్తారు. క్లాస్ -4 ఉద్యోగి కుటుంబానికి రూ .5 లక్షలు, నాన్ గెజిటెడ్ అధికారి స్థాయి కుటుంబానికి రూ .8 లక్షలు, గెజిటెడ్ అధికారి స్థాయి కుటుంబానికి రూ .10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తారు.
>ఉద్యోగ సంఘాల హర్షం .. కారుణ్య నియామకాల ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి . ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, పి.దామోదరరావు, నేషనల్ మద్దూర్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు .
Those who want to download this Notification & Apply Online Link
Click on the link given below
========================
Important Links: