Latest APPSC D Mart Mega Job Mela Latest Job Information in Telugu

Latest APPSC D Mart Mega Job Mela Latest Job Information in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

➡️ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ 

>రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

>సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్లో ఆరు అసిస్టెంట్ డైరెక్టర్, ఏపీ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో 4 డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు.

>అసిస్టెంట్ డైరెక్టర్ కోసం అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 లోగా, డీపీఆర్వో కోసం అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

>వివరాల కోసం https://psc.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు.

✅️Notification Click Here

➡️విద్యావాలంటీర్ల నియామకానికి ఉత్తర్వులు జారీ

>రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నేపథ్యంలో పార్ట్ టైం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించేందుకు ఆ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.

>మున్సిపల్ పాఠశాలల్లో అత్యధిక విద్యార్థుల సంఖ్య ఉండటంతో ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో లేక బోధనా వసరాలు తీరడం లేదు.

>ఈ నేపథ్యంలో 2021- 22 విద్యా సంవత్సరానికి సంబంధించి 2400 మంది విద్యా వలంటీర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని డీఎంఏ ఎంఎం నాయక్ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు.

>వీరికి నెలకు రూ. 8 వేల చొప్పున చెల్లిస్తామని తెలిపారు.

>విద్యా వలంటీర్ల నియామకంలో ఆర్టీత, ఆ డీఎంఏ నిబంధనలు పాటించాలని సూచించారు.

>గౌరవ వేతనంగా రూ.12 వేలైనా ఇవ్వాలి: ఎంటీఎఫ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ విద్యా వలంటీర్లను నియమించాలని పలుమార్లు ప్రాతినిధ్యం చేసిన నేపథ్యంలో ఉత్తర్వులు విడుదలయ్యాయని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ . రామకృష్ణ తెలిపారు.

>ఉత్తర్వుల ప్రకారం విద్యార్థుల సంఖ్యను బట్టి ఖాళీ టీచర్ల పోస్టులను కలుపుకొని కమిషనర్, ప్రధానోపాధ్యాయులు కలిసి పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లను ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు.

>అయితే పాఠశాలల్లో బోధనా వసరాలు తీర్చే విద్యావలంటీర్లకు కనీసం రూ.12 వేలైనా గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Those who want to download this Notification & Apply Link 

Click on the link given below

========================

Important Links:

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts