Job Mela, Free Training, APPSC Job Recruitment Apply Online
➡️జాబ్ మేళా రేపు
>శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని డీఎల్ టీసీ / ఐటీఐ కేంద్రం లో నిరుద్యోగులకు గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు.
>మంగళవారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
>విశాఖప ట్నం జిల్లా దువ్వాడలోని సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్లో ఆపరేటర్ ట్రైనీ, ట్రైనీ, జూనియర్ ట్రైనీ పోస్టులు 200 వరకు ఖాళీ ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామన్నారు.
>అలాగే రాజమండ్రి ఎలైట్ ఏపీ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 15 భర్తీ చేసేందుకు ఆయా సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు.
>సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్లో ఆపరేటర్ ట్రైనీ పోస్టుకు మెకానికల్, ఎలక్ట్రికల్, మెటలర్జీలో డిప్లమా కలిగి 20 నుంచి 35 ఏళ్ల వయస్సు గలవా రు అర్హులని, రూ.10 వేలు జీతం ఉంటుందని చెప్పారు.
>ట్రైనీ పోస్టులకు ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, సిఎన్సీ, డిఎం, ఫౌండరీమెన్, వెల్డర్, పెయింటర్‌కు ఐటీఐ చేసి 20 నుంచి 35 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని, వీరికి రూ.9 వేలు జీతం ఉంటుందని తెలిపారు.
>జూనియర్ ట్రైనీ పోస్టులకు టెన్, ఇంటర్ విద్యార్థులు అర్హులన్నారు. వీరికి రూ .8 వేలు జీతం ఉంటుందని ఆయన తెలిపారు.
>రాజమండ్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డిగ్రీ పూర్తిచేసిన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని, స్మార్ట్ ఫోన్, బైక్ తప్పనిసరిగా కలిగి ఉండి, 18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు ఉం డాలని చెప్పారు.
>వీరికి నెలకు రూ.13 వేలు జీతం ఉంటుందని, ఆసక్తి గల వారు ఈ నెల 30 న ఉదయం 10 గంటలకు బలగ హాస్ప టల్ జంక్షన్ లో ఉన్న డీఎల్ టీసీ శిక్షణ కేంద్రం వద్దకు హాజరుకావాల న్నారు.
>తమ వెంట తమ బయోడేటా, ఆధార్ కార్డ్, నాలుగు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, విద్యార్హత సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురా వాలని ఆయన సూచించారు.
➡️71 ప్రభుత్వ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు సాక్షి, అమరావతి :
>రాష్ట్రంలో 71 ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్లు జారీ చేసింది.
>ఈ నోటిఫికేషన్లను కమిషన్ వెబ్ సైట్లో ఉంచినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు.
>పోస్టులు, దరఖాస్తు తేదీలు
• హార్టీకల్చర్ ఆఫీసర్ పోస్టులు 39. దరఖాస్తులను అక్టోబర్ 11 నుంచి నవంబర్ 2 వరకు సమర్పించవచ్చు .
• తెలుగు రిపోర్టర్ (లెజిస్లేచర్) పోస్టులు 5. దరఖాస్తులను అక్టోబర్ 18 నుంచి నవంబర్ 8 వరకు స్వీకరిస్తారు.
• ఆయుర్వేద లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 3. దరఖాస్తులను అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు సమర్పించవచ్చు.
• హోమియో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 24. దరఖాస్తులను అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు స్వీకరిస్తారు.
➡️దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి ఎడ్యుకేషన్ : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, హిటాచీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరు చానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏసీ టెక్నీషియన్ కోర్సును ఉచితంగా నిర్వహించనున్నారు.
>ఆ మేరకు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ పి.గణేష్ మం గళవారం తెలిపారు. బేసిక్ ఏసీ, స్పెట్ ఏసీ అం శాల్లో ఇస్టలేషన్, మెయింటెనెన్స్ రిపేర్లపై 90 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వ నున్నట్లు పేర్కొన్నారు.
>పదో తరగతి ఆపై విద్యార్హత కలిగిన వారు అక్టోబరు 4 వ తేదీ లోపు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధారు కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటోలతో దరఖాస్తు చేసుకో వాలని సూచించారు.
>వివరాలకు 90003 99888, 9985808200 నంబర్లలో సంప్రదిం చాలని ఆయన కోరారు.
➡️ఉపాధికి ఉచిత శిక్షణ చంద్రగిరి : యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో అక్టో బర్ 4 వ తేదీ నుంచి 30 రోజులపాటు మహిళ లకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు.
>మంగళ వారం ఆయన మాట్లాడుతూ పదో తరగతి ఉత్తీర్ణులైన 19 నుంచి 40 ఏళ్ల లోపు మహిళ లకు ఆర్య వర్క్ , ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పై శిక్షణ ఇస్తామన్నారు.
>ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, బస్సు చార్జీలు అందిస్తామని వెల్లడించారు. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్ అందజేస్తామన్నారు.
>ఆసక్తి గల వారు ఆధార్, రేషన్ కార్డు జెరాన్లు, 4 పాస్పోర్టు ఫొటోలు తీసుకువచ్చి పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు.
>ఒక్కో బ్యాచ్ కు 30 మందిని మాత్రమే తీసు కుంటామని, ముందుగా పేర్లు నమోదు చేసు కున్న వారికి ప్రాధాన్యమిస్తామని వివరిం చారు.
>వివరాలకు యూనియన్ బ్యాంకు గ్రామీణ సంస్థ, ద్వారకానగర్, చంద్రగిరి, వివరాలకు7989680587,7382412220, 6301217672 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
➡️దరఖాస్తుల ఆహ్వానం విజయనగరం పూల్ లాగ్ : సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టుల భర్తీకి అర్హత గల ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష ఏపీసీ డి.కీ ర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
>ఈ నెల 29 నుంచి వచ్చేనెల 7 వ తేదీలోగా దర ఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు వివ రాల కోసం విజయనగరం.ఎస్ఎసి.ఇన్ వెబ్ సై ట్ లో పొందవచ్చన్నారు.
>ఖాళీల వివరాలు .. అకడమిక్ మానటరింగ్ అధికారి, ఎంఐఎస్, ప్లానింగ్ కోఆర్డినేటర్, కమ్యూనిటీ మోబలై జేషన్ అధికారి, గర్ల్ చైల్డ్ డెవలెప్మెంట్ అధికారి, ఏఎస్ కో ఆర్డినేటర్, అసిస్టెంట్ ప్రొగ్రా మింగ్ అధికారి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి (ఆర్ఎంఎస్ఎ), అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి (సమగ్రశిక్ష), అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవెలెప్ మెంట్ అధికారి పోస్టులు భర్తీ చేయనున్నారు.