➡️29 న జాబ్ మేళా కర్నూలు కల్చరల్
>జిల్లా ఉపాధి శాఖ కార్యా లయంలో ఈనెల 29 వ తేదీ ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎస్.వెంకట రమాదేవి ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు.
>భారతి ఎయి టెల్ ప్రైవేట్ లిమిటెడ్లో మార్కెటింగ్ ఎగ్జి క్యూటివ్ 20 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉం టాయని పేర్కొన్నారు .
>వేతనం రూ.14,000 ఉంటుందని తెలిపారు.
>డిగ్రీ చదివి 32 సంవ త్సరాలలోపు వయసు ఉన్న పురుషులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు .
➡️ కర్నూలు జిల్లాలో వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి గడివేముల : మండలంలోని గడివేములలో 6 , మంచాలకట్ట, కె . బొల్లవరం గ్రామాల్లో రెండు చొప్పున , పెసరవాయిలో ఒకటి వలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
>వాటికి అర్హులైన వారు సోమవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ విజయసింహారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో కోరారు.
➡️ గుంటూరు జిల్లాలలో వలంటీర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
>పెదకాకాని : పెదకాకాని మండలంలో కాళీగా ఉన్న వలంటీర్ల నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ వై హనుమారెడ్డి తెలిపారు.
>పెదకాకాని మండల పరిధిలోని పెదకాకాని గ్రామంలో ఎస్సీ 1, బీసీ 1, ఓసీ 2 చొప్పున కాళీలు ఉన్నాయన్నారు. అలానే నంబూరులో ఓసీ 1, తక్కెళ్ళపాడులో బీసీ 1, కొప్పు రావూరులో బీసీ 2, ఓసీ 1 చొప్పున కాళీగా ఉన్న వలం టీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
>ఈనెల 27 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకూ మూడు రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.
>ఆసక్తి గల వారు అప్లికేషన్ పెట్టుకుని, అనంతరం జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఎంపీడీఓ ఆదివారం తెలియజేశారు.
➡️రేపు ఉద్యోగ మేళా తూర్పుగోదావరి జిల్లా
>రాజమహేంద్రవరం రూరల్: మోరంపూడిలోని శ్రీమతి జాస్తి బుల్లెమ్మాయి డిగ్రీ కళాశాల ఆవర ణలో ఆ కళాశాల, వికాస సంస్థ ఆధ్వర్యంలో 28 వ తేదీ మంగళవారం ఉద్యోగ మేళా నిర్వ హించనున్నట్లు ప్రిన్సిపాల్ పి.జ్యోతి ఓ ప్రక టనలో పేర్కొన్నారు.
>టీసీఎస్ సంస్థలో బీపీఎస్ ఉద్యోగానికి ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి ఇంట ర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. దీనికి బీఏ, బీకాం బీఎస్సీ 2019, 2020, 2021 సంవత్సరంలో ఉత్తీర్ణులైన స్త్రీ / పురుషు అభ్యర్థులు అర్హులని తెలిపారు.
>కోజెంట్ ఇ – సర్వీసెస్ ప్రైవేట్ లిమి టెడ్ సంస్థలో బీపీవో (తెలుగు) ఉద్యోగానికి ఇంటర్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు స్త్రీ / పు రుషులు అర్హులన్నారు.
>డెక్కన్ కెమికల్స్ సంస్థ ప్రొడక్షన్ విభాగంలో ట్రైనీ ఉద్యోగానికి బి.ఫా ర్మసీ, డి.ఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ, బయోకె మిస్ట్రీ, బయోటెక్నాలజీ 2017 సంవత్సరం నుం 2020 సంవత్సరంలో ఉత్తీర్ణులైన పురుషులకు అవకాశం ఉందన్నారు.
>అమెజాన్ సంస్థలో లాజిస్టిక్స్ ఉద్యోగానికి ఎస్ఎస్సీ ఆపైన ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు స్త్రీ/ పురుషులు కావాలన్నారు.
>హోండాయ్ మొబీస్ సంస్థలో టెక్నీషియన్ ఉద్యోగానికి ఐటీఐ ఆల్ ట్రేడ్స్, డిప్లొమో (ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ అండ్ ఆటో మొబైల్ 2017, 18, 19, 2020 సంవత్స రాల్లో ఉత్తీర్ణులైనవారు), బీటెక్ ( ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, ఆటోమొబైల్) ఉత్తీర్ణులైన 28 ఏళ్లలోపు పురుషులు అర్హులని తెలిపారు.
>ఆర్ఎస్ఎంఐపీఎల్ సంస్థలో మొబైల్ అసెంబ్లర్ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ, ఇంటర్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన మహిళలకు అవకాశం ఉందన్నారు.
>పై ఉద్యోగాల్లో నెలకు రూ .10 వేల నుంచి రూ .18 వేల వరకు జీతం + ఇన్సెటివ్స్ ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటోందన్నారు.
>ఆసక్తి ఉన్న అభ్యర్థులు రాజమహేంద్రవరం సమీపం లోని మోరంపూడి శ్రీమతి జాస్తి బుల్లెమ్మాయి డిగ్రీ కళాశాలకు మంగళవారం ఉదయం 9 గం టలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు.
ఇతర వివరాలకు 89199 22782 ఫోన్ నంబరులో, www.vikasajobs.com వెబ్ సైట్ లో సంప్రదిం చాలని ప్రిన్సిపాల్ వివరించారు.
➡️నిరుద్యోగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ రొళ్ల: నిరుద్యోగ యువతీయువకులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు ఎంప్లాయి మెంట్ జనరేషన్ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లిష్ కమ్యూనికే షన్ సిల్క్ పై శిక్షణ ఇస్తామని వైస్సార్ క్రాంతి పథం ఏపీఎం సురేష్, జాబ్స్ కో – ఆర్డినేటర్ కె.లక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
>శిక్షణ తరగతులకు హాజరయ్యే వారికి ఉచిత భోజనం సౌకర్యంతో పాటు వసతి కల్పిం చడం జరుగుతుందన్నారు.
>శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందజేస్తామని పేర్కొన్నారు.
>ఆసక్తి గలవారు ఈనెల 28 వ తేదీలోపు 7989479371 నంబరు సంప్రదించాలని కోరారు.