గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ
>చంద్రగిరి: గ్రామీణ యువతకు ఉపాధి అవ కాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏసీ, ఫ్రిజ్ మరమ్మతులు, టైలరింగ్ పై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ కృష్ణమో హన్ తెలిపారు.
>పదో తరగతి చదివి, తెల్లరేషన్ కార్డు గల, 19 నుంచి 40 ఏళ్ల లోపు యువ తీయువకులకు శిక్షణకు అర్హులన్నారు. 80 రోజుల శిక్షణలో అభ్యర్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు .
>ఆసక్తిగల వారు ఆధార్, రేషన్ కార్డు జెరాక్స్, 4 పాస్పోర్టు సైజ్ ఫొటోలతో నేరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
>ఇతర వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణాభి వృద్ధి సంస్థ, ద్వారకా నగర్, కొత్తపేట, చంద్రగిరి.
>ఫోన్ : 7989680587, 7382412220, 6801717672 నంబర్లను సంప్రదించాలని కోరారు .
➡️అకౌంటెంట్ పోస్టుకు దరఖాస్తులు
>ఆహ్వానం సాక్షి, అమరావతి : అకౌంటెంట్ పోస్టు కోసం రాష్ట్ర పోలీసు సంక్షేమ సంఘం దరఖాస్తులు ఆహ్వానించింది.
>ప్రభుత్వేతర సంస్థ అయిన ఈ సంఘంలో అకౌంటెంట్ పోస్టు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తారు.
>ఆసక్తి ఉన్న అభ్యర్ధు లు appolice.gov.in వెబ్ సైట్ నుంచి దర ఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
>దరఖాస్తు లను ఆన్లైన్ ద్వారా అక్టోబరు 11 లోగా సమ ర్పించాలని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యా లయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది .
➡️స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
>అనంతపురం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సిరి, డీఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వరప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
>నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని 26 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేశామని పేర్కొన్నారు.
>ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించారని గుర్తు చేశారు. తాజాగా కుటుంబ సంక్షేమ శాఖ అర్బన్ పీ హెచ్ సీ లలో 87 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకు న్నారని పేర్కొన్నారు.
>ఈ మొత్తం 113 పోస్టులకు ఈ నెల 30 వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు .