AP TET Notification 2022 Released : Teacher Eligibility Test Details in Telugu
ఆగస్టు 6న ఉపాధ్యాయ అర్హత పరీక్ష : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) -2022 కు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 6 నుంచి ఆన్లైన్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా పరీక్షలు ఎన్ని రోజులు నిర్వహించాలో నిర్ణయిస్తారు. జూన్ 15 నుంచి జులై 15 వరకు దరఖా స్తులు స్వీకరిస్తారు. అనంతరం హాల్టికెట్లు జారీ చేస్తారు.
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు టెట్ నిర్వ హించాల్సి ఉండగా .. గతేడాది మార్చిలో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించి ఏడాది ఒక్కసారే నిర్వహించాలనే నిబంధన తీసుకొచ్చింది. 2018 లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) తో కలిపి టెట్ నిర్వహించారు. ఈసారి టెట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. టెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు ఉండగా గతేడాది ఎన్ సీటీఈ జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా సవరించింది.
పాఠశాల విద్యాశాఖ టెట్ ప్రకటనను శుక్రవారం విడుదల చేయనుంది. వివరాలు : http://cse.ap.gov.in లో నేడు ఏపీ టెట్ -2022 నోటిఫికేషన్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం నోటిఫికేషన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుం తదితర వివరాలకు’ http://aptet.apcfss.in/’ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10.30 నుంచి ఈ వెబ్సైట్ నుంచి సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Official Web Page & Apply Link Click Here
➡️AP TET Test Syllabus Pdf Click Here
➡️Join Telegram Account Mor job update daily Click Here