Latest AP Anganwadi Recruitment 2022 in Telugu Apply Online | Anganwadi District Wise List in Telugu

Latest AP Anganwadi Recruitment 2022 in Telugu Apply Online | Anganwadi District Wise List in Telugu

అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు  కృష్ణాజిల్లా అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం మండవల్లి : స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నందు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు అందజేయాలని సీడీపీఓ పి. ధనలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో కోరారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మండవల్లి ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న మొఖాసాకలవపూడి (ఓపెన్), మండవల్లి -2 (ఎస్సీ), ఆనందపురం (ఎస్సీ), ముదినేపల్లి మం డలంలోని చిగురుకోట బీసీ (డీ) అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు స్థానికులు, వివాహి తులై ఉండాలన్నారు. 1-07-22వ సంవత్సరా నికి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలన్నారు. 10 వ తర గతి మార్కుల లిస్ట్, రేషన్కార్డు తదితర ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని పేర్కొన్నారు. ప్రీ స్కూల్ ట్రైనింగ్ అయితే సంబంధిత ధ్రువీక రణ పత్రం జత చేయాలని సూచించారు.

కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై, ఈ ఏడాది జూలై ఒకటి నాటికి 21 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉన్న స్థానిక మహిళ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసు కోవచ్చు.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

>తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

>జనరల్ కేటగిరీలో ధరఖాస్తు చేసుకోనే అభ్యర్థినులు 01/07/2022 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.

>అభ్యర్థిని తప్పని సరిగా వివాహితురాలయి ఉండాలి.

>అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా అనగా గ్రామ పంచాయతి పరిదిలో ఆ అంగన్వాడి పోస్టు ఖాళీని బట్టి ఆ గ్రామ పంచాయతి అభ్యర్థినులు అర్హులు మరియు అర్బన్ ఏరియాలో ఆ వార్డు పరిదిలోని అంగన్వాడి ఖాళీలను బట్టి అభ్యర్థినులు అర్హులు.

>నోటిఫికేషన్ లో జనరల్ కేటగిరీ క్రింద చూపబడిన అర్హులైన VH (దృష్టి లోపం), HH (వినికిడి లోపం) మరియు OH (శారీరక వైకల్యం) అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నచో వారిని మాత్రమే మాత్రమే దివ్యాంగుల సమాన అవకాశాల నిబంధనల (రోస్టర్- ROR) నిబంధనల మేరకు ఎంపిక చేయబడును.

>ఎస్.సి, ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థినులు 01.07.2022 నాటికి 18-35 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు. అయితే 21-35 సం, రాల వయస్సు గల అర్హులు లేనప్పుడు మాత్రమే (18-21) సం,రాల వారి దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకుంటారు.

>ఎస్.సి.కి కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతికి చెందిన అభ్యర్థినులు అర్హులు.

>ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే హ్యాబిటేషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు .

ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.

>వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగినవారు.

>అందత్వం ఉన్నప్పటికీ (Escort) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.

>కాళ్ళు, చేతులకు సంబందించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు.

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం (2022-23).

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత … అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here 

➡️Application Pdf Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page