10th అర్హతతో ప్రభుత్వ స్కూల్స్ లో వార్డ్ బాయ్స్, క్లర్క్, మెస్ మేనేజర్ జాబ్స్, జీతం రూ.44,900 వరకు | Sainik School Goalpara Recruitment 2026
Sainik School Goalpara Recruitment 2026 Latest LDC, Ward Boy, Mess Manager Jobs Notification Apply Now : సైనిక్ స్కూల్లో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం. అస్సాంలోని సైనిక్ స్కూల్ గోల్పారా PGT, TGT, బ్యాండ్ మాస్టర్, పిటిఐ కమ్ మేట్రాన్, మెస్ మేనేజర్, LDC, వార్డ్ బాయ్, ఆఫీస్ సూపరింటెండెంట్, హార్స్ రైడింగ్ ఇంస్ట్రుక్టర్ & సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వివిధ బోధనా, పరిపాలనా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 12 ఖాళీలకు అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పోస్టులను బట్టి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో పాటు సంబంధిత అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాల్లో కొన్ని రెగ్యులర్ పోస్టులు కాగా, మిగిలినవి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు. అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ వివరాలు తెలుసుకున్న తర్వాత అప్లై చేయండి.

Sainik School Goalpara Recruitment 2026 Overview
సైనిక్ స్కూల్ గోల్పారాలో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో మొత్తం 12 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హతలు ఉన్న అభ్యర్థులు పోస్టును బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు.
• సంస్థ పేరు: సైనిక్ స్కూల్ గోల్పారా
• మొత్తం ఖాళీలు: 12
• ఉద్యోగాలు: PGT, TGT, LDC, మెస్ మేనేజర్ & వార్డ్ బాయ్స్ తదితర పోస్టులు
• అర్హత: 10వ తరగతి నుంచి పీజీ వరకు (పోస్టును బట్టి)
• వయస్సు: 18–50 సంవత్సరాలు (పోస్టును బట్టి)
• గరిష్ఠ జీతం: నెలకు ₹53,880
• ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/డెమాన్‌స్ట్రేషన్, ఇంటర్వ్యూ
• దరఖాస్తు ఫీజు: జనరల్ ₹300; SC/ST/OBC ₹200
• చివరి తేదీ: 12 నవంబర్ 2026
• దరఖాస్తు విధానం: పోస్టు ద్వారా లేదా స్వయంగా
• అధికారిక వెబ్సైట్: www.sainikschoolgoalpara.org
ఖాళీల వివరాలు : ఈ నోటిఫికేషన్లో క్వార్టర్ మాస్టర్, పీజీటీ ఫిజిక్స్, టీజీటీ మ్యాథమెటిక్స్, టీజీటీ సోషల్ సైన్స్, బ్యాండ్ మాస్టర్, పీటీఐ కమ్ మేట్రాన్, మెస్ మేనేజర్, ఎల్డీసీ తదితర పోస్టులు ఉన్నాయి.
• క్వార్టర్ మాస్టర్ : 01
• పీజీటీ ఫిజిక్స్ : 01
• టీజీటీ మ్యాథమెటిక్స్ : 01
• టీజీటీ సోషల్ సైన్స్ : 01
• బ్యాండ్ మాస్టర్ : 01
• పీటీఐ కమ్ మేట్రాన్ (మహిళ) : 01
• మెస్ మేనేజర్ : 01
• ఎల్డీసీ : 01
• వార్డ్ బాయ్ : 02
• ఆఫీస్ సూపరింటెండెంట్ : 01
• సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ : 01
• గుర్రపు స్వారీ శిక్షకుడు : 01
విద్యార్హతలు ఏమిటి:
పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. క్వార్టర్ మాస్టర్ పోస్టుకు డిగ్రీతో పాటు సంబంధిత స్టోర్స్ నిర్వహణ అనుభవం అవసరం. పీజీటీ ఫిజిక్స్ పోస్టుకు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ లేదా నోటిఫికేషన్లో పేర్కొన్న సమాన అర్హతలు అవసరం.
టీజీటీ మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు బి.ఎడ్ లేదా నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రత్యామ్నాయ అర్హతలు ఉండాలి. బ్యాండ్ మాస్టర్ పోస్టుకు గుర్తింపు పొందిన బ్యాండ్ శిక్షణ కోర్సు అవసరం.
పీటీఐ కమ్ మేట్రాన్ పోస్టుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్లొమా, మెస్ మేనేజర్ పోస్టుకు క్యాటరింగ్ అర్హతతో పాటు అనుభవం కోరుతున్నారు. ఎల్డీసీ పోస్టుకు పదో తరగతి, నిమిషానికి కనీసం 40 పదాల టైపింగ్ వేగం, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
వార్డ్ బాయ్ పోస్టుకు పదో తరగతి లేదా సమాన అర్హత, ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టుకు నిర్దిష్ట కార్యాలయ అనుభవం, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుకు ఐటీ లేదా కంప్యూటర్ సంబంధిత డిగ్రీ/డిప్లొమా అవసరం. గుర్రపు స్వారీ శిక్షకుడి పోస్టుకు ఇంటర్మీడియట్‌తో పాటు సంబంధిత శిక్షణ అర్హత ఉండాలి.
వయోపరిమితి : చాలా పోస్టులకు 12 నవంబర్ 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 50 సంవత్సరాల వయస్సు ఉండాలి. పీజీటీ, టీజీటీ, బ్యాండ్ మాస్టర్ పోస్టులకు కనీస వయస్సు 21 సంవత్సరాలుగా పేర్కొన్నారు. క్వార్టర్ మాస్టర్ పోస్టుకు కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 50 సంవత్సరాలు.
పోస్టును బట్టి వయోపరిమితి, రిజర్వేషన్ వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
జీతం ఎంత ఉంటుంది : ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలవారీ ఏకీకృత వేతనం చెల్లిస్తారు.
• క్వార్టర్ మాస్టర్ : రూ.53,880 |
• ఆఫీస్ సూపరింటెండెంట్ : రూ.42,480/-
• బ్యాండ్ మాస్టర్ : రూ.40,880/-
• మెస్ మేనేజర్ : రూ.40,880/-
• సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ : రూ.30,000/-
• పీటీఐ కమ్ మేట్రాన్ : రూ.25,200/-
• ఎల్డీసీ : రూ.23,880/-
• వార్డ్ బాయ్ : రూ.21,600/-
కొన్ని పోస్టులకు పాఠశాల నిబంధనల ప్రకారం వసతి, భోజన సదుపాయాలు కూడా కల్పిస్తారు. మిగిలిన పోస్టుల జీతాల వివరాలను సంబంధిత నోటిఫికేషన్లో నిర్ధారించుకోవాలి.
ఎంపిక విధానం : అభ్యర్థుల ఎంపికకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, ప్రాథమిక గణితం, పోస్టుకు సంబంధించిన సబ్జెక్టు ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి పోస్టును బట్టి స్కిల్ టెస్ట్, క్లాస్ డెమాన్‌స్ట్రేషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు : దరఖాస్తుతో పాటు డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించాలి.
• జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300.
• ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రూ.200.
డిమాండ్ డ్రాఫ్ట్‌ను Principal, Sainik School Goalpara పేరిట, SBI మోర్నాయ్ బ్రాంచ్‌లో చెల్లించే విధంగా తీసుకోవాలి. ఫీజు తిరిగి చెల్లించబడదు.
అవసరమైన డాక్యుమెంట్లు : దరఖాస్తుతో పాటు ఇటీవల తీసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో, రెజ్యూమె, పూర్తి చిరునామా, ఈమెయిల్, మొబైల్ నంబర్, విద్యార్హతల మార్కుల మెమోలు, అనుభవ ధ్రువపత్రాలు, ఇతర సంబంధిత సర్టిఫికెట్ల ధృవీకరించిన ప్రతులు జతచేయాలి.
ఎలా దరఖాస్తు చేయాలి : ముందుగా [సైనిక్ స్కూల్ గోల్పారా అధికారిక వెబ్సైట్](https://www.sainikschoolgoalpara.org/)లో నోటిఫికేషన్, దరఖాస్తు ప్రొఫార్మాను పరిశీలించండి. మీ విద్యార్హతలకు సరిపోయే పోస్టును ఎంచుకుని, దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి. అవసరమైన డాక్యుమెంట్లు, డిమాండ్ డ్రాఫ్ట్ జతచేసి పోస్టు ద్వారా లేదా స్వయంగా పాఠశాలకు సమర్పించాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ గోల్పారా, PO: రాజపారా, జిల్లా: గోల్పారా, అస్సాం – 783133.
దరఖాస్తు కవర్‌పై సంబంధిత పోస్టు పేరు, అది రెగ్యులర్ లేదా కాంట్రాక్టు పోస్టు అనే వివరాలు రాయాలి.
ముఖ్యమైన తేదీ : దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 12 నవంబర్ 2026. చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు, డిమాండ్ డ్రాఫ్ట్ జతచేయని దరఖాస్తులు స్వీకరించబడవు. ఇంటర్వ్యూ తేదీని అర్హులైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

