డీ-మార్ట్ కంటే తక్కువ ధరలకే వస్తువులు. పండుగ వేళ నిత్యావసరాలపై భారీ రాయితీలు. మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన | AP Rythubazaar
AP Rythubazaar Rice Low Prices Festival Discounts : ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 151 రైతుబజార్లలో బీపీటీ సన్నరకం బియ్యాన్ని కిలో రూ.49 చొప్పున విక్రయిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఒక్కొక్కరికి 26 కిలోల బియ్యం బ్యాగ్ అందిస్తున్నట్లు వెల్లడించారు.
విజయవాడ రైతుబజార్లో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. మార్కెట్లో కిలో రూ.85 ధర పలుకుతున్న నెల్లూరు కేఎన్ఎం (KNM) బియ్యాన్ని రూ.50కే అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
పండుగ సమయంలో సామాన్య ప్రజలకు ధరల భారం తగ్గించేందుకు నిత్యావసర వస్తువులను డీ-మార్ట్ కంటే 35 శాతం తక్కువ ధరలకే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ చర్యలతో ప్రజలకు కొంత ఆర్థిక ఊరట లభించనుంది.
తక్కువ ధరలకు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండటంతో కుటుంబ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రజలకు అవకాశం కలగనుంది.


