Agriculture Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ జాబ్స్ | AP Horticulture Jobs 2026
AP Horticulture Jobs 2026 Walk In Interview : డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో 8 ఔట్సోర్సింగ్ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ. అక్టోబర్ 13న కొవ్వూరులో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం వచ్చింది. డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీకి చెందిన ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా కేంద్రం, కొవ్వూరులో పలు పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక నిర్వహిస్తారు.
ఈ నియామకంలో మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, రికార్డ్ అసిస్టెంట్, మాలి/గార్డినర్, శానిటరీ అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టుల వివరాలు
•ఎలక్ట్రీషియన్ -1 పోస్టు: ఈ పోస్టుకు ITI (Electrical) అర్హత తప్పనిసరిగా ఉండాలి.
•రికార్డ్ అసిస్టెంట్ – 1 పోస్టు: SSC లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత ఉండాలి.
•మాలి/గార్డినర్ – 5 పోస్టులు: ఈ పోస్టులకు అభ్యర్థులు ఏదైనా ఒక ప్రాంతీయ భాషను చదవడం, రాయడం తెలిసి ఉండాలి. వీటిలో మహిళలకు, వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకు కేటాయింపులు ఉన్నాయి.
•శానిటరీ అటెండర్ – 1 పోస్టు: ఈ పోస్టుకు సంబంధిత రోస్టర్ ప్రకారం నియామకం ఉంటుంది.
ఎంపిక ఎలా ఉంటుంది : అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. పోస్టులన్నీ ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ప్రయాణ భత్యం లేదా రోజువారీ భత్యం చెల్లించరు.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఎప్పుడు : ఈ పోస్టులకు 2026 అక్టోబర్ 13న ఉదయం 10:00 గంటలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల తర్వాత వచ్చే అభ్యర్థులను ఇంటర్వ్యూకు అనుమతించరు.
ఇంటర్వ్యూ ప్రదేశం: ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా కేంద్రం, కొవ్వూరు-534350, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఏం తీసుకెళ్లాలి : ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు మరియు ఇతర అవసరమైన ధ్రువపత్రాలు తీసుకెళ్లాలి. అలాగే కార్యాలయ వినియోగం కోసం అటెస్టెడ్ సర్టిఫికెట్ల ఒక సెట్‌ను కూడా వెంట తీసుకెళ్లాలి.
అభ్యర్థులు తమ భోజనం, వసతి ఏర్పాట్లను స్వయంగా చేసుకోవాలి. ఉద్యోగానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, రోస్టర్, అర్హతలు మరియు దరఖాస్తు విధానాన్ని అధికారిక నోటీసులో పరిశీలించి ఇంటర్వ్యూకు హాజరు కావడం మంచిది.
నోటిఫికేషన్ తేదీ: 05-10-2026
వాక్-ఇన్ తేదీ: 13-10-2026
సమయం: ఉదయం 10:00 గంటలకు
మొత్తం పోస్టులు: 8
విధానం: ఔట్సోర్సింగ్ / వాక్-ఇన్ ఇంటర్వ్యూ

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

